త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల‌లో పాజిటివ్ సంకేతాలు.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో ర్యాలీలు కొన‌సాగుతుండడంతో గురువారం బులియ‌న్ మార్కెట్ల‌లోనూ కొనుగోళ్ల ఉత్సాహం క‌నిపించింది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.24 శాతం పెరిగి 4,702 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.80 శాతం పెరిగి 77.89 డాల‌ర్ల వ‌ద్ద ఉంది.

S

Business | Published On May 7, 2026, 11.31 am IST

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల‌లో పాజిటివ్ సంకేతాలు.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో ర్యాలీలు కొన‌సాగుతుండడంతో గురువారం బులియ‌న్ మార్కెట్ల‌లోనూ కొనుగోళ్ల ఉత్సాహం క‌నిపించింది. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.24 శాతం పెరిగి 4,702 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.80 శాతం పెరిగి 77.89 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 604 పాయింట్లు పెరిగి 1,52,736 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,223 పాయింట్లు పెరిగి 2,56,488 వ‌ద్ద ఉంది. మ‌ధ్య ప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్త‌త‌లు త‌గ్గి అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందాల వైపు చూస్తుండ‌డంతో మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావం ప‌డింది. దీంతో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు గురువారం స్వ‌ల్పంగా పెరిగాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,246 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,21,968 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,52,460 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,24,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,300 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,975 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,11,800గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,39,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,97,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3వేలు పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,434 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,472గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,340 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,43,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2వేలు పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,70,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,700గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర కేజీకి రూ.5వేలు పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,75,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,750 గా ఉంది.

Advertisement
Advertisement