Gold And Silver Prices Today | గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండడంతో ఆ ప్రభావం బులియన్ మార్కెట్‌లపైనా పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందంగా దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రకటించడంతోపాటు హోర్ముజ్ జలసంధిలో సైనిక ఆపరేషన్‌ను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించారు.
Gold And Silver Prices Today | గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండడంతో ఆ ప్రభావం బులియన్ మార్కెట్‌లపైనా పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందంగా దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రకటించడంతోపాటు హోర్ముజ్ జలసంధిలో సైనిక ఆపరేషన్‌ను నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.99 శాతం మేర పెరిగి 4,646 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 3.70 శాతం ఎగబాకి 75.49 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,121 పాయింట్లు పెరిగి 1,51,884 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6,184 పాయింట్లు పెరిగి 2,50,500 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,131 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21,048 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,310 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,13,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.21,300 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,870 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,38,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,87,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.19,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,348 ఉండగా, 8 గ్రాముల ధర రూ.90,784గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,480 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,34,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.15,900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధర కేజీకి రూ.10వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా, తులం ధర రూ.2,700 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



