త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | మ‌ళ్లీ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్త‌తలు.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధ ఉద్రిక్త‌త‌లు మళ్లీ పెరుగుతుండడంతో ఆ ప్ర‌భావం అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌పై ప‌డింది. దేశీయ మార్కెట్లు సైతం మంగ‌ళ‌వారం న‌ష్టాల్లో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్‌ల‌లో మాత్రం లాభాలు న‌మోదయ్యాయి.

S

Business | Published On May 5, 2026, 11.51 am IST

Gold And Silver Prices Today | మ‌ళ్లీ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్త‌తలు.. స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధ ఉద్రిక్త‌త‌లు మళ్లీ పెరుగుతుండడంతో ఆ ప్ర‌భావం అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌పై ప‌డింది. దేశీయ మార్కెట్లు సైతం మంగ‌ళ‌వారం న‌ష్టాల్లో కొన‌సాగుతుండ‌గా, బులియ‌న్ మార్కెట్‌ల‌లో మాత్రం లాభాలు న‌మోదయ్యాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర ఔన్స్‌కు 0.40 శాతం పెరిగి 4,542 వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.31 శాతం పెరిగి 72.90 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 200 పాయింట్లు పెరిగి 1,49,539 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 225 పాయింట్లు పెరిగి 2,44,120 వ‌ద్ద ఉంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,918 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19,344 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,49,180 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,91,800 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,400 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,675 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,04,400గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,36,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,67,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4వేలు త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,189 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.89,512గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,11,890 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,18,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర కేజీకి రూ.10వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,650 గా ఉంది.

Advertisement
Advertisement