Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. బంగారం, వెండి దారెటు..?
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా చూపిస్తోంది. సాధారణంగా యుద్ధం సమయాల్లో బంగారం, వెండి సేఫ్ హావెన్ ఆస్తుల ధరలు పెరుగుతాయి. కానీ యుద్ధం ప్రారంభం అయ్యే సమయానికే ఆయా లోహాల ధరలు గరిష్ట స్థాయిలను తాకాయి.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం బులియన్ మార్కెట్లపైనా చూపిస్తోంది. సాధారణంగా యుద్ధం సమయాల్లో బంగారం, వెండి సేఫ్ హావెన్ ఆస్తుల ధరలు పెరుగుతాయి. కానీ యుద్ధం ప్రారంభం అయ్యే సమయానికే ఆయా లోహాల ధరలు గరిష్ట స్థాయిలను తాకాయి. దీంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కాస్త అవకాశం లభిస్తే వీటిల్లో పెట్టుబడులు పెడదామని ఆలోచిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.38 శాతం తగ్గి 4,603 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.03 శాతం పెరిగి 73.76 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ ఎంసీఎక్స్‌కు మే 1 సందర్భంగా సెలవు కాగా అంతకు ముందు సెషన్ ముగింపులో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2061 పాయింట్లు పెరిగి 1,51,111 వద్ద ముగిసింది. అలాగే సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6,202 పాయింట్లు పెరిగి 2,44,456 వద్ద స్థిరపడింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,235 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21,880 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,350 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,23,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,965 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,720గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,96,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,426 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,408గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,260 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,42,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధర కేజీకి రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



