త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి త‌గ్గిందా..?

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీ పెరిగిన నేప‌థ్యంలో శుక్ర‌వారం కాస్త దిగి వ‌చ్చాయి. ముఖ్యంగా అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం, అమెరికా ట్రెజ‌రీ ఈల్డ్స్ పెర‌గ‌డం, సేఫ్ హావెన్ ఆస్తుల ప‌ట్ల పెట్టుబ‌డిదారులు విముఖ‌త చూప‌డంతో ఆయా ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. అమెరికా, చైనా చ‌ర్చ‌ల నేప‌థ్యంలో ఈక్విటీ మార్కెట్ల‌కు కాస్త జోష్ వ‌చ్చింద‌ని భావిస్తున్నారు.

S

Business | Published On May 15, 2026, 11.24 am IST

Gold And Silver Prices Today | భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి త‌గ్గిందా..?
Advertisement

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు భారీ పెరిగిన నేప‌థ్యంలో శుక్ర‌వారం కాస్త దిగి వ‌చ్చాయి. ముఖ్యంగా అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం, అమెరికా ట్రెజ‌రీ ఈల్డ్స్ పెర‌గ‌డం, సేఫ్ హావెన్ ఆస్తుల ప‌ట్ల పెట్టుబ‌డిదారులు విముఖ‌త చూప‌డంతో ఆయా ధ‌ర‌లు కాస్త త‌గ్గాయి. అమెరికా, చైనా చ‌ర్చ‌ల నేప‌థ్యంలో ఈక్విటీ మార్కెట్ల‌కు కాస్త జోష్ వ‌చ్చింద‌ని భావిస్తున్నారు. దీని వ‌ల్ల కూడా పెట్టుబ‌డిదారులు స్టాక్స్ వైపు మొగ్గు చూపుతూ, బంగారం, వెండి కొనుగోళ్ల‌ను త‌గ్గించారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1.78 శాతం త‌గ్గి 4,566 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 6.47 శాతం ప‌త‌న‌మై 78 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2938 పాయింట్లు ప‌త‌న‌మై 1,59,050 వ‌ద్ద ఉంది. సిల్వ‌ర్ ప్యూచ‌ర్స్ కాంట్రాక్టు 17,466 పాయింట్ల మేర ప‌త‌న‌మై 2,73,636 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,009 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,28,072 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,60,090 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.16,00,900 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.22,400 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,675 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,17,400గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,46,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,67,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.20,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,007 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.96,056గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,20,070 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,00,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.16,800 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,90,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,900గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.10వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.3,05,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.3,050 గా ఉంది.

Advertisement
Advertisement