Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్‌లలో అనిశ్చితి..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు బంగారం, వెండి ధరలు ఆకాశానికి పరుగులు పెట్టగా యుద్ధం మొదలయ్యాక ఈ ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో బంగారం, వెండి లాంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు బంగారం, వెండి ధరలు ఆకాశానికి పరుగులు పెట్టగా యుద్ధం మొదలయ్యాక ఈ ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో బంగారం, వెండి లాంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు. కానీ యుద్ధం ప్రారంభం అయ్యే నాటికే ఈ లోహాలు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. అందువల్ల పెట్టుబడిదారులు ఈ లోహాలపై పెట్టుబడి పెట్టేందుకు కాస్త వెనుకడుగు వేస్తున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న వార్తల కోసం వేచి చూస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతుండగా ఔన్స్ బంగారం ధర 10 డాలర్లు పెరిగి 4,798 వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధర 0.60 డాలర్ల మేర పెరిగి 79 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 132 పాయింట్లు తగ్గి 1,53,020 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,372 పాయింట్లు పతనమై 2,50,000 వద్ద ఉంది. కాగా దేశీయ స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,420 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23,360 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,200 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,42,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.13,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,135 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,13,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,565 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,520గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,56,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,300 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేల మేర తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



