Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు పెరిగిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలు, దేశ ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధించడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలు, దేశ ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధించడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ ఈక్విటీ మార్కెట్లు సైతం కొనుగోళ్ల ఉత్సాహాన్ని చూపిస్తుండడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తోంది. పెట్టుబడిదారులు రిస్క్ తీసుకునే ధోరణిని మరింత పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే బులియన్ మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు మళ్లీ ఊపందుకుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర బుధవారం 1.86 శాతం మేర ఎగబాకి 4,154 డాలర్లకు చేరగా, వెండి ధర 3.33 శాతం మేర ఎగసి 61 డాలర్లకు పెరిగింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,101 పాయింట్లు పెరిగి 1,46,439 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,783 పాయింట్లు పెరిగి 2,26,105 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,575 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16, 600గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,45,750 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,57,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.17,500 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,360 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,06,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,33,600 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,36,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.16వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,931 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,448గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,09,310 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,93,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు పెరిగింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
సెప్టెంబర్ 19, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
సెప్టెంబర్ 18, 2026

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



