త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. మార్పు లేకుండా కొన‌సాగుతున్న వెండి..

Gold And Silver Prices Today | ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పూట‌కో మాట మాట్లాడుతున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల‌కు లోన‌వుతున్నాయి. మ‌రోవైపు బులియ‌న్ మార్కెట్ సైతం అనిశ్చితిలో కొన‌సాగుతోంది. యుద్ధానికి ముందు బంగారం, వెండి ధ‌ర‌లు ప‌రుగులు పెట్టాయి.

S

Business | Published On Apr 7, 2026, 11.45 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. మార్పు లేకుండా కొన‌సాగుతున్న వెండి..
Advertisement

Gold And Silver Prices Today | ఇరాన్‌తో చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పూట‌కో మాట మాట్లాడుతున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల‌కు లోన‌వుతున్నాయి. మ‌రోవైపు బులియ‌న్ మార్కెట్ సైతం అనిశ్చితిలో కొన‌సాగుతోంది. యుద్ధానికి ముందు బంగారం, వెండి ధ‌ర‌లు ప‌రుగులు పెట్టాయి. అయితే ప్ర‌స్తుతం అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డుతుండడంతో వీటి ధ‌రలు తగ్గుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం నాటి సెష‌న్‌లోనూ ఈ లోహాల ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 213 పాయింట్లు (0.14 శాతం) త‌గ్గి 1,49,768 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 421 పాయింట్లు (0.18 శాతం) త‌గ్గి 2,32,958 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్క్ లో ఔన్స్ బంగారం ధ‌ర 7.60 డాల‌ర్ల మేర త‌గ్గి 4,643 వ‌ద్ద కొన‌సాగుతోంది. వెండి ధ‌ర 0.318 డాల‌ర్లు త‌గ్గి 72.525 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగార ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,984 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19,872గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,49,840గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,98,400 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,200 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,735 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,09,880గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,37,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,73,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,238 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.89,904గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,12, 380 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,23,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,100 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550గా ఉంది.

Advertisement
Advertisement