Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన..
Gold And Silver Prices Today | ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనగా దేశీయ స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం పడి సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Gold And Silver Prices Today | ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనగా దేశీయ స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం పడి సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే దీనికి తోడు డాలర్ బలపడడం వంటి కారణాల వల్ల సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 18 డాలర్ల మేర (0.42 శాతం) తగ్గి 4,656 వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధర 0.777 డాలర్లు తగ్గి (1.11 శాతం) 72.338 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 153 పాయింట్లు తగ్గి (0.09 శాతం) 1,49,546 వద్ద కొనసాగుతుండగా, సిల్వర్ ప్యూచర్స్ కాంట్రాక్టు 695 పాయింట్లు (0.30 శాతం) తగ్గి 2,31,800 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,913 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19,304గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,130గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,91,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.18వేలు తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,670 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,360గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,36,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,67,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.16,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,185 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,480గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,11,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,18,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



