త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య రెండో ద‌ఫా శాంతి చ‌ర్చ‌ల‌పై సందిగ్ధ‌త ఉన్న‌ప్ప‌టికీ హోర్ముజ్ జ‌ల‌సంధిలో సైనిక చ‌ర్య‌ల‌ను త‌గ్గిస్తామ‌ని ఇరాన్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. దీంతో దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లు కొన‌సాగుతున్నాయి.

S

Business | Published On Apr 29, 2026, 11.43 am IST

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య రెండో ద‌ఫా శాంతి చ‌ర్చ‌ల‌పై సందిగ్ధ‌త ఉన్న‌ప్ప‌టికీ హోర్ముజ్ జ‌ల‌సంధిలో సైనిక చ‌ర్య‌ల‌ను త‌గ్గిస్తామ‌ని ఇరాన్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. దీంతో దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లు కొన‌సాగుతున్నాయి. ఇక పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి కొనుగోళ్ల‌పై దృష్టి సారించ‌డంతో వీటి ధ‌ర‌లు బుధ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో స్వ‌ల్పంగా పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.02 శాతం మేర పెరిగి 4,597 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.98 శాతం పెరిగి 73 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 0.02 శాతం మేర పెరిగి 1,49,500కు పైన ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2.80 శాతం పెరిగి 2,44,000 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌రలు స్వ‌ల్పంగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,137 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,21,096 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,51,370 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,13,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,400 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,875 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,11,000గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,38,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,87,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4వేలు పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,353 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.90,824గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,13,530 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,35,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,300 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,650 గా ఉంది.

Advertisement
Advertisement