త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | తీవ్ర‌మైన అస్థిర‌త‌తో కొన‌సాగుతున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారులు జాగ్ర‌త్త‌..

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌ల‌పై సందిగ్ధం నెల‌కొన‌డం, చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఇటీవ‌లి కాలంలో అంత‌ర్జాతీయంగా, దేశీయ క‌మోడిటీ మార్కెట్ల‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు తీవ్రంగా అస్థిరత‌తో ఉన్నాయి.

S

Business | Published On Apr 28, 2026, 11.27 am IST

Gold And Silver Prices Today | తీవ్ర‌మైన అస్థిర‌త‌తో కొన‌సాగుతున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారులు జాగ్ర‌త్త‌..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌ల‌పై సందిగ్ధం నెల‌కొన‌డం, చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఇటీవ‌లి కాలంలో అంత‌ర్జాతీయంగా, దేశీయ క‌మోడిటీ మార్కెట్ల‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు తీవ్రంగా అస్థిరత‌తో ఉన్నాయి. పెట్టుబ‌డిదారులు కొత్త పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆలోచిస్తుండ‌గా, ప్ర‌స్తుతం పెట్టుబ‌డులు ఉన్న‌వారు కాస్త ధ‌ర‌లు పెర‌గ్గానే లాభాల బుకింగ్‌కు చూస్తున్నారు. దీంతో ధ‌ర‌లు అస్థిరంగా ఉన్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధర మంగ‌ళ‌వారం 56 డాల‌ర్లు త‌గ్గి 4,625 వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 2.15 డాల‌ర్లు త‌గ్గి 73.35 వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1195 పాయింట్లు త‌గ్గి 1,50,515 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 4,507 పాయింట్లు త‌గ్గి 2,37,317 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్ లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,300 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22,400 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,53,000 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,30,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,100 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,025 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,200గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,02,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,475 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,800గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,750 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,47,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,650 గా ఉంది.

Advertisement
Advertisement