Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడులు పెట్టేందుకు చాన్స్ వచ్చిందా..?
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. అనేక దేశాలకు చెందిన బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ ప్రభావం బులియన్ మార్కెట్‌పైనా పడింది.
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. అనేక దేశాలకు చెందిన బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ ప్రభావం బులియన్ మార్కెట్‌పైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 12 డాలర్ల మేర తగ్గి 4,682 వద్ద ఉండగా, వెండి ధర 0.50 డాలర్ తగ్గి 75 వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 215 పాయింట్లు పతనమై 1,51,546 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 861 పాయింట్లు తగ్గి 2,40,652 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,295 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22,360 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,950 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,29,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6వేలు తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,020 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12,160గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,02,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,471 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,768గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,710 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,47,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,59,900 ఉండగా, తులం ధర రూ.2,599గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు స్వల్పంగా రూ.100 మాత్రమే తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



