Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆసక్తి..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధం ముగుస్తుందనే సంకేతాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఆసియా, భారత మార్కెట్లలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో గోల్డ్ కు పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరిగింది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ యుద్ధం ముగుస్తుందనే సంకేతాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెరగడంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఆసియా, భారత మార్కెట్లలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో గోల్డ్ కు పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరిగింది. MCXలో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు సూచీ 1,51,427 వద్ద గ్యాప్-అప్‌తో ప్రారంభమైంది. అనంతరం ఇంట్రాడేలో 1,51,870 గరిష్ఠాన్ని తాకి దాదాపు 0.50 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో COMEX గోల్డ్ ధరలు కూడా ఆసియా ట్రేడింగ్ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతుతో పెరిగాయి. ఔన్స్‌కు బంగారం ధర 4,751.26 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు రెండు వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. కాగా దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,148 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21,184గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,51,480గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,14,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.19,700 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,885 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,38,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,88,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.18వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,361 ఉండగా, 8 గ్రాముల ధర రూ.90,888గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,610 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,36,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.14,800 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ.5వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



