త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావం..

Gold And Silver Prices Today | ప‌శ్చిమాసియాలో కొన‌సాగిస్తున్న యుద్ధానికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇరాన్ కాస్త విరామం ఇవ్వ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అలాగే లెబ‌నాన్‌పై సైనిక చ‌ర్య‌ను ఆపేస్తామ‌ని, వారితో చర్చ‌ల‌కు సిద్ధ‌మని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు ప్ర‌క‌టించ‌డం కూడా మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావాన్ని చూపించింది.

S

Business | Published On Apr 10, 2026, 11.31 am IST

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావం..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమాసియాలో కొన‌సాగిస్తున్న యుద్ధానికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఇరాన్ కాస్త విరామం ఇవ్వ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అలాగే లెబ‌నాన్‌పై సైనిక చ‌ర్య‌ను ఆపేస్తామ‌ని, వారితో చర్చ‌ల‌కు సిద్ధ‌మని ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు ప్ర‌క‌టించ‌డం కూడా మార్కెట్ల‌పై పాజిటివ్ ప్ర‌భావాన్ని చూపించింది. దీంతో శుక్ర‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో ఈక్విటీలు భారీ లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మాత్రం ప‌త‌నం అయ్యాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 494 పాయింట్లు (0.32 శాతం) త‌గ్గి 1,52,940 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 963 పాయింట్లు (0.40 శాతం) త‌గ్గి 2,42,805 వద్ద ట్రేడ‌వుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 2 డాల‌ర్ల‌కు పైగా పెరిగి 4,767 వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.645 డాల‌ర్లు పెరిగి 76.110 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,300 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22,400గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,53,000గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,30,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.15,200 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,025 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,200గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,02,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.14వేలు పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,475 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,800గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,750 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,47,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,400 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది కేజీకి రూ.5వేల మేర పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,65,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,650గా ఉంది.

Advertisement
Advertisement