Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. బంగారం ధరలు ఇప్పట్లో పెరగవా..?
Gold And Silver Prices Today | అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత, అనిశ్చితి కొనసాగుతుండడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత, అనిశ్చితి కొనసాగుతుండడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఏవైనా అనుకోని పరిణామాలు ఎదురైతే పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టాల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. అందువల్లే ఆయా లోహాల ధరలు పెరగడం లేదు. అలా అని పతనం కూడా అవడం లేదు. అన్ని మార్కెట్లలోనూ అనిశ్చిత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2.2 డాలర్ల మేర స్వల్పంగా పెరిగి 4,711 వద్ద ఉండగా, వెండి ధర 0.02 డాలర్ల మేర స్వల్పంగా తగ్గి 75 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 299 పాయింట్లు తగ్గి 1,52,400 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,348 పాయింట్లు తగ్గి 2,43,288 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,442 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23,536 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,420 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,44,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,800 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,155 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,240గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,550 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,15,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,582 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,656గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,820 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,58,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా, తులం ధర రూ.2,700 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



