త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. బులియ‌న్ మార్కెట్ల‌లో అనిశ్చితి..

Gold And Silver Prices Today | మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బుధ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. అంత‌ర్జాతీయంగా బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి కార‌ణంగా పెట్టుబ‌డిదారులు ప్రాఫిట్ బుకింగ్ కోసం య‌త్నించారు. దీని వ‌ల్ల ధ‌ర‌ల్లో స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల క‌నిపించింది.

S

Business | Published On Mar 11, 2026, 10.56 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. బులియ‌న్ మార్కెట్ల‌లో అనిశ్చితి..
Advertisement

Gold And Silver Prices Today | మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బుధ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. అంత‌ర్జాతీయంగా బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి కార‌ణంగా పెట్టుబ‌డిదారులు ప్రాఫిట్ బుకింగ్ కోసం య‌త్నించారు. దీని వ‌ల్ల ధ‌ర‌ల్లో స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల క‌నిపించింది. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ ఫ్యూచ‌ర్స్ గోల్డ్ కాంట్రాక్ట్ క్రితం సెష‌న్‌లో 1,63,303 వ‌ద్ద ముగియ‌గా ఈరోజు మార్కెట్ సెష‌న్‌లో 0.09 శాతం త‌గ్గి 163,149 వద్ద ఓపెన్ అయింది. ప్ర‌స్తుతం 1,62,718 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఎంసీఎక్స్ మే నెల ఫ్యూచ‌ర్స్ సిల్వ‌ర్ కాంట్రాక్టు క్రితం సెష‌న్‌లో 2,77,850 వద్ద ముగియ‌గా ఈ రోజు సెష‌న్‌లో 0.31 శాతం తగ్గి 2,76,988 వ‌ద్ద ఓపెన్ అయింది. ప్ర‌స్తుతం 2,75,648 వ‌ద్ద కొన‌సాగుతోంది.

దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,331 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,30,648గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,63,310గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.16, 33,100 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.9,300 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,970 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19,760గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,49,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,97,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,500 పెరిగింది. 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,248 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.97,984గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,22,480 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,24,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,900 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2.90 ల‌క్ష‌లు ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,900 ఉంది. నిన్న‌టితో పోలిస్తే ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.3 ల‌క్ష‌లు ఉండ‌గా, తులం ధ‌ర రూ.3వేలుగా ఉంది. ఈ ధ‌ర‌ల్లోనూ మార్పు లేదు.

Advertisement
Advertisement