త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బ‌ల‌హీన ప‌డ్డ అమెరికా డాల‌ర్‌.. పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ బ‌ల‌హీన ప‌డ‌డంతో అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మంగ‌ళ‌వారం కాస్త పెరిగాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచ‌ర్ కాంట్రాక్టు 1,444 (0.9 శాతం) పెరిగి 1,61,743 వ‌ద్ద ట్రేడ్ అయింది. గ‌త సెష‌న్‌లో ఇది 1,60,299 వ‌ద్ద ముగిసింది.

S

Business | Published On Mar 10, 2026, 11.16 am IST

Gold And Silver Prices Today | బ‌ల‌హీన ప‌డ్డ అమెరికా డాల‌ర్‌.. పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా డాల‌ర్ బ‌ల‌హీన ప‌డ‌డంతో అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మంగ‌ళ‌వారం కాస్త పెరిగాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచ‌ర్ కాంట్రాక్టు 1,444 (0.9 శాతం) పెరిగి 1,61,743 వ‌ద్ద ట్రేడ్ అయింది. గ‌త సెష‌న్‌లో ఇది 1,60,299 వ‌ద్ద ముగిసింది. ఇక ఎంసీఎక్స్‌లో మే నెల‌కు చెందిన సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 3,840 (1.43 శాతం) పెరిగి 2,71,000 వ‌ద్ద ట్రేడ్ అయింది. క్రితం సెష‌న్‌లో ఇది 2,67,160 వ‌ద్ద క్లోజ్ అయింది. ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి ధ‌ర‌ల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. అమెరికా డాల‌ర్ బ‌ల‌హీన ప‌డడంతో పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి కొనుగోళ్ల ప‌ట్ల ఆస‌క్తి చూపించారు. మ‌రోవైపు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ముగుస్తుంద‌నే సంకేతాలు ఇవ్వ‌డంతో స్టాక్ మార్కెట్ల‌లో సైతం ఊపు వ‌చ్చింది. అన్ని ప్ర‌ధాన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.16,238 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,29,904గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,62,380గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.16, 23,800 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7వేలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,885 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19,080గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,48,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,88,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 పెరిగింది. 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,179 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.97,432గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,21,790 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,17,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,300 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2.90 ల‌క్ష‌లు ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,900 ఉంది. ఇది నిన్న‌టితో పోలిస్తే కేజీకి రూ.10వేలు పెరిగింది. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.3 ల‌క్ష‌లు ఉండ‌గా, తులం ధ‌ర రూ.3వేలుగా ఉంది.

Advertisement
Advertisement