త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఎంసీఎక్స్ ప‌రిస్థితి ఏంటి..?

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల్లో అనిశ్చితి కొన‌సాగుతోంది. పెట్టుబ‌డిదారులు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యుద్ధం నేప‌థ్యంలో వీటి ధ‌ర‌లు భారీగా పెర‌గడం ఖాయ‌మ‌ని భావించారు. కానీ ఇప్ప‌టికే ఆల్ టైం హై స్థాయిల్లో ఉన్నందున ఈ లోహాల ధ‌ర‌ల్లో భారీ హెచ్చుత‌గ్గులు క‌నిపించ‌డం లేదు.

S

Business | Published On Mar 17, 2026, 11.07 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఎంసీఎక్స్ ప‌రిస్థితి ఏంటి..?
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల్లో అనిశ్చితి కొన‌సాగుతోంది. పెట్టుబ‌డిదారులు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యుద్ధం నేప‌థ్యంలో వీటి ధ‌ర‌లు భారీగా పెర‌గడం ఖాయ‌మ‌ని భావించారు. కానీ ఇప్ప‌టికే ఆల్ టైం హై స్థాయిల్లో ఉన్నందున ఈ లోహాల ధ‌ర‌ల్లో భారీ హెచ్చుత‌గ్గులు క‌నిపించ‌డం లేదు. ఇక మంగ‌ళ‌వారం నాటి మార్కెట్ సెష‌న్‌లో ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. అలాగే స్పాట్ మార్కెట్‌లోనూ పెరుగుద‌ల చోటు చేసుకుంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1445 పాయింట్లు (0.93 శాతం) పెరిగి 1,57,181 వ‌ద్ద ట్రేడ్ అవుతుండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 5,268 పాయింట్లు (2.05 శాతం) పెరిగి 2,61,800 వ‌ద్ద కొన‌సాగుతోంది. స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధ‌ర 100 గ్రాముల‌కు రూ.12వేలు పెర‌గ్గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.11వేలు, 18 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.9వేలు పెరిగింది. వెండి ధ‌ర‌ల్లో దేశీయంగా కిలోకు రూ.5వేల పెరుగుద‌ల చోటు చేసుకుంది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,862 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,26,896గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,58,620గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,86,200 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.12వేలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,540 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,320గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,54,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11వేలు పెరిగింది. 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,897 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,176గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,18,970 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,89,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9వేలు పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,75,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2.80 ల‌క్ష‌లు ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,800గా ఉంది.

Advertisement
Advertisement