Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల దారెటు..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయి. వార్తలను ఆధారంగా చేసుకుని మార్కెట్లు కదిలే పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం ప్రకటన చేస్తారా అని పెట్టుబడిదారులు ఆందోళనగా ఉన్నారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయి. వార్తలను ఆధారంగా చేసుకుని మార్కెట్లు కదిలే పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం ప్రకటన చేస్తారా అని పెట్టుబడిదారులు ఆందోళనగా ఉన్నారు. అయితే అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతాయని వార్తలు రావడం, ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాల్పుల విరమణను మరికొద్ది రోజులు పొడిగించడం వంటి కారణాలతో మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. శుక్రవారం నాడు ముగిసిన సెషన్‌లో అమెరికా మార్కెట్లు చాలా వరకు లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఇక బంగారం, వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 15 డాలర్లు పెరిగి 4,709 వద్ద ఉండగా, వెండి ధర 0.25 డాలర్లు పెరిగి 75.69 వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 938 పాయింట్లు పెరిగి 1,52,699 వద్ద ముగియగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,123 పాయింట్లు పెరిగి 2,44,636 వద్ద స్థిరపడింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,404 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23,232 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,040 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,40,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.10,900 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,120 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,12,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,553 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,424గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,530 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,55,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.8,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు స్వల్పంగా రూ.100 మాత్రమే పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా, తులం ధర రూ.2,700 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



