త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి..

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయంగా అన్ని దేశాల‌కు చెందిన స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా భారీగా ప‌త‌నం అవుతున్న‌ప్ప‌టికీ బంగారం, వెండి ధ‌ర‌ల్లో మాత్రం అనిశ్చితి నెల‌కొంది. సాధార‌ణంగా యుద్ధ స‌మ‌యాల్లో ఈ లోహాల ధ‌ర‌లు పెరుగుతాయి. పెట్టుబ‌డిదారులు సుర‌క్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు.

S

Business | Published On Mar 16, 2026, 11.56 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న అనిశ్చితి..
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయంగా అన్ని దేశాల‌కు చెందిన స్టాక్ మార్కెట్లు గ‌త కొద్ది రోజులుగా భారీగా ప‌త‌నం అవుతున్న‌ప్ప‌టికీ బంగారం, వెండి ధ‌ర‌ల్లో మాత్రం అనిశ్చితి నెల‌కొంది. సాధార‌ణంగా యుద్ధ స‌మ‌యాల్లో ఈ లోహాల ధ‌ర‌లు పెరుగుతాయి. పెట్టుబ‌డిదారులు సుర‌క్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. కానీ ప్ర‌స్తుతం వీటి ధ‌ర‌లు మాత్రం భారీగా పెర‌గ‌డం లేదు. కాస్త పెరిగినా మ‌ళ్లీ పెట్టుబ‌డిదారులు లాభాల బుకింగ్ కోసం చూస్తుండ‌డంతో ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. ఇలా బంగారం, వెండి మార్కెట్‌లో అనిశ్చితి నెల‌కొంది. ఇక ఎంసీఎక్స్‌లో సోమ‌వారం నాటి ట్రేడింగ్ సెష‌న్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1389 పాయింట్లు (0.88 శాతం) త‌గ్గి 1,57,077 వ‌ద్ద కొన‌సాగుతోంది. అలాగే సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2938 పాయింట్లు (1.13 శాతం) త‌గ్గి 2,56,250 వ‌ద్ద కొన‌సాగుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 12 డాలర్లు (0.27 శాతం) పెరిగి 5034 వ‌ద్ద కొన‌సాగుతోంది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,917 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,27,336గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,59,170గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,91,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 త‌గ్గింది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,590 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,720గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,59,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 త‌గ్గింది. 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,938 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,504గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,19,380 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,93,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,600 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,70,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,700గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే కిలోకు రూ.5వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2.76 ల‌క్ష‌లు ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,760గా ఉంది.

Advertisement
Advertisement