Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వారం నుంచి పాజిటివ్ ట్రెండ్..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం అయిన తరువాత అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు ఇప్పటి వరకు భారీగా పతనం అయ్యాయి. అయితే బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు ఈసారి పరుగులు పెట్టలేదు. సాధారణంగా యుద్ధం సమయంలో ఈ లోహాల ధరలు పెరుగుతాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం అయిన తరువాత అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు ఇప్పటి వరకు భారీగా పతనం అయ్యాయి. అయితే బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు పెట్టుబడిదారులు ఈసారి పరుగులు పెట్టలేదు. సాధారణంగా యుద్ధం సమయంలో ఈ లోహాల ధరలు పెరుగుతాయి. కానీ అమెరికా డాలర్ బలంగా ఉండడం బంగారం, వెండి ధరల పెరుగుదలను నిరోధించింది. అయినప్పటికీ గత వారం రోజుల నుంచి వీటి ధరలు మళ్లీ భారీగానే పెరిగాయి. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటించడంతోపాటు చర్చలకు సిద్ధమవడంతోనే బులియన్ మార్కెట్లలో గత వారం రోజుల నుంచి ర్యాలీ కొనసాగుతోంది.
కమోడిటీ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు క్రితం సెషన్ ముగింపులో 16.84 డాలర్ల మేర తగ్గి 4,748 వద్ద ముగియగా, వెండి ధర 0.55 డాలర్లు పెరిగి 76 డాలర్ల వద్ద స్థిర పడింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు క్రితం సెషన్ ముగింపు వరకు 782 పాయింట్లు పతనమై1,52,652 వద్ద నిలవగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 494 పాయింట్లు నష్టపోయి 2,43,274 వద్ద నిలిచింది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో మాత్రం క్రితం రోజు ముగింపుతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,284 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22,272గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,840గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,28,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.4,900 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,010 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,40,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,01,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,463 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,704గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,630 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,46,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



