Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. యుద్ధానికి బ్రేక్ ఇవ్వడంతోనే..
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చేస్తున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని, రెండు వారాల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పగానే అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా దీనికి అంగీకరిస్తున్నట్లు తెలపడంతో మార్కెట్లకు మరింత ఉత్సాహం వచ్చింది.
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చేస్తున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని, రెండు వారాల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పగానే అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా దీనికి అంగీకరిస్తున్నట్లు తెలపడంతో మార్కెట్లకు మరింత ఉత్సాహం వచ్చింది. అయితే ఈక్విటీలతోపాటు బులియన్ మార్కెట్లలోనూ. బుధవారం జోరు కనిపించింది. బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా పతనం అవుతుండగా ఇవాళ మాత్రం భారీగా పెరిగాయి. ఈ లోహాల ధరలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 10 నుంచి 17 శాతం మేర పతనం అయ్యాయి. అయితే యుద్ధానికి బ్రేక్ ఇవ్వడంతోపాటు త్వరలోనే అది ముగుస్తుందనే సంకేతాలు వెలువడుతుండడంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఉత్సాహం చూపించారు. అలాగే అమెరికా డాలర్ కూడా కాస్త బలహీనపడింది. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 124 డాలర్లు పెరిగి 4,830 వద్ద ఉండగా, వెండి ధర 4 డాలర్లు పెరిగి 77 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,200 పాయింట్ల మేర పెరిగి 1,54,469 వద్ద ఉండగా, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టు 14,924 పాయింట్లు పెరిగి 2,46,116 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,382 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23,056గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,53,820గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,38,200 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.39,800 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,100 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12,800గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,000 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,10,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.36,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,537 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,296గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15, 370 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,53,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.29,900 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది కేజీకి రూ.10వేల మేర పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



