Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మాత్రం పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో కాల్పుల విరమణ గడువును పెంచినప్పటికీ ఆయన మాటలపై నమ్మకం లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
Gold And Silver Prices Today | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మాత్రం పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో కాల్పుల విరమణ గడువును పెంచినప్పటికీ ఆయన మాటలపై నమ్మకం లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో స్టాక్ మార్కెట్లు మిశ్రమ ధోరణితో కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 48 డాలర్ల మేర పెరిగి 4,769 వద్ద ఉండగా, వెండి ధర 1.85 డాలర్లు పెరిగి 78.56 వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1828 పాయింట్లు పెరిగి 1,53,499 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 5,645 పాయింట్లు పెరిగి 2,50,346 వద్ద ఉంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,475 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23,800 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,750 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,47,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.5,400 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,185 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,480గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,18,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,606 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,848గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,060 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,60,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,100 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



