Gold And Silver Prices Today | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఊరట కనిపించింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగా, డాలర్ బలహీనపడింది. ఈ ప్రభావంతో మంగళవారం ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పసిడి లాభాలు పరిమితమయ్యాయి.
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఊరట కనిపించింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగా, డాలర్ బలహీనపడింది. ఈ ప్రభావంతో మంగళవారం ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పసిడి లాభాలు పరిమితమయ్యాయి. ఉదయం సమయంలో ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 0.17 శాతం పెరిగి 10 గ్రాములకు 1,59,674 వద్ద ట్రేడ్ అయ్యాయి. మరోవైపు ఎంసీఎక్స్ సిల్వర్ జూలై ఫ్యూచర్స్ 0.30 శాతం తగ్గి కిలోకు 2,75,824 వద్ద నమోదయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 2 శాతం వరకు పడిపోవడంతో బ్యారెల్‌కు 110 డాలర్ల దిగువకు చేరాయి. దీంతో అమెరికన్ డాలర్‌కు డిమాండ్ తగ్గింది. డాలర్ ఇండెక్స్ 0.20 శాతానికి పైగా పడిపోవడంతో ఇతర కరెన్సీల కొనుగోలుదారులకు బులియన్ చౌకగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.33 శాతం తగ్గి 4,551 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.61 శాతం తగ్గి 76.38 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగ్గా, వెండి ధర స్వల్పంగా తగ్గింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,702 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,25, 632 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,57,040 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,70,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.8,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,395 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15,160గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,950 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,39,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,778 ఉండగా, 8 గ్రాముల ధర రూ.94,224గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,780 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,77,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,100 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,85,000 ఉండగా, తులం ధర రూ.2,850గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.3,00,000 ఉండగా, తులం ధర రూ.3,000 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో వారాంతంలో జోష్.. వచ్చే వారం ఎలా ఉంటుంది..?
ఆగస్టు 15, 2026

Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
ఆగస్టు 14, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Hurricane Lala | హవాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల తర్వాత బిగ్ఐలాండ్ను నేరుగా తాకే ఛాన్స్..!
- ●Weekly Horoscope | ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి!
- ●US shootings | కాల్పులతో దద్దరిల్లిన అమెరికా
- ●Balapur Ganesh | పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం
- ●Horoscope | ఆగస్టు 16 రాశి ఫలాలు.. ఈ రాశివారు సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు!
- ●Gold Limit in India | ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు? పత్రాలు లేకుండా లిమిట్ దాటితే సీజ్ చేస్తారా?

Hurricane Lala | హవాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల తర్వాత బిగ్ఐలాండ్ను నేరుగా తాకే ఛాన్స్..!

Weekly Horoscope | ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి!

US shootings | కాల్పులతో దద్దరిల్లిన అమెరికా

Balapur Ganesh | పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం



