త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekly Horoscope | ఆప్తుల నుంచి కీల‌క స‌మాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

G

Horoscope | Published On Aug 16, 2026, 7.37 am IST

Weekly Horoscope | ఆప్తుల నుంచి కీల‌క స‌మాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి!
Advertisement

మేషం (Aries)

ఈ వారం అన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అపారమైన ఆత్మవిశ్వాసంతో కార్యసిద్ధి సాధిస్తారు. ఆర్థికంగా నూతన అవకాశాలు ఎదురవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభకార్యాల‌లో పాలుపంచుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గ‌తానుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ప్రయాణాలు ఆహ్లాదంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.

వృషభం (Taurus)

వృషభ రాశి వారు ఈ వారం అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. కుటుంబ బాధ్య‌తలు పెరుగుతాయి. అపారమైన ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో అత్యుత్తమైన ఫలితాలు సాధిస్తారు. ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ పెట్టుబడులు, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదాల ప‌రిష్కారంలో ఆటంకాలు ఉంటాయి. బంధువుల‌ను క‌లుస్తారు. తీర్థ‌యాత్ర‌లు చేస్తారు. విద్యార్థులు కొంత నిరాశ చందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిథునం (Gemini)

ఈ వారం అన్ని రంగాల వారికి గ్రహబలం విశేషంగా కలిసి వస్తోంది. కొత్త ప‌నులు చేప‌ట్టి స‌మ‌యానికి పూర్తి చేస్తారు. ఆస్తి వ్య‌వ‌హారాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగంలో స్పష్టమైన వైఖరితో పదోన్నతులు అందుకుంటారు. అధికారుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయంలో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. సంతాన‌ప‌రంగా ఇబ్బందులు తొల‌గుతాయి. బంధువుల‌తో విరోధాలు ఉండే అవ‌కాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం (Cancer)

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. వ్య‌తిరేకులు సైతం అనుకూలంగా మారుతారు. ఉద్యోగంలో మీ హోదా పెరగడంతో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చిన్న‌నాటి మిత్రుల‌ను క‌లుసుకుంటారు. కుటుంబ సభ్యులతో సామరస్యంగా మాట్లాడటం వలన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.

సింహం (Leo)

ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు అందుకుంటారు. అధికారుల నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు. వ్యాపారంలో ఆచి తూచి అడుగేయాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమయానికి డబ్బు అందుతుంది. ఆర్థిక ప‌రిస్థితి గ‌తం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. పొదుపుపై దృష్టి సారించాలి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది క‌లిగిస్తుంది. బంధువుల నుంచి శుభ‌వార్త‌లు వింటారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.

కన్య (Virgo)

ఈ వారం అన్ని రంగాల వారికి శుభకరంగా ఉంటుంది. అన్నింటా విజ‌య‌మే వ‌రిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి. పెట్టుబడులపై లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థికంగా విశేషమైన లాభాలు అందుకుంటారు. అంద‌రిలోనూ ప్ర‌త్యేక‌త నిలుపుకుంటారు. ముఖ్య నిర్ణ‌యాలు తీసుకుంటారు. ప‌ర‌ప‌తి పెరుగుతుంది. వాహ‌నాలు, గృహం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

తుల (Libra)

తుల రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రేష్ఠమైన సమయం కొనసాగుతుంది. ఉద్యోగంలో అంతా మంచే జరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఆదాయంలో పురోగతి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. అనుకున్న ప‌నుల్లో ప్ర‌తిబంధ‌కాలు తొల‌గుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధ‌న‌, ఆస్తిలాభాలు క‌లుగుతాయి. శుభ‌కార్యాల‌కు డ‌బ్బు ఖ‌ర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పనిసరి.

వృశ్చికం (Scorpio)

అన్ని రంగాల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. దైవబలం సహకరిస్తుంది. ముఖ్య‌మైన ప‌నుల‌ను నేర్పుగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ఆచి తూచి అడుగేయాలి. పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారంలో మ‌రింత అనుకూల‌త ఉంటుంది. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనుకున్న స‌మ‌యానికి డ‌బ్బు అందుతుంది. నూతన మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఆత్మీయుల‌తో స‌ఖ్య‌త నెల‌కొంటుంది. నూత‌న విద్య, ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కుతాయి. ఆస్తి వివాదాల నుంచి బ‌య‌ట‌ప‌డుతారు. కుటుంబంలో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సంతానం నుంచి కీల‌క స‌మాచారం అందుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల‌లో అనుకూల మార్పులు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో మెలిగితే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులు కీలకమైన నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని స‌మ‌స్య‌ల‌ను నేర్పుగా ప‌రిష్క‌రించుకుంటారు. ఆస్తుల వ్య‌వ‌హారంలో ఒప్పందాలు చేస‌కుంటారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులకు పోవద్దు. ఆత్మీయుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తీర్ధ‌యాత్ర‌లు చేస్తారు. మిత్రుల‌తో మాట‌ప‌ట్టింపులు వ‌స్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మకరం (Capricorn)

ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు నిరంతర కృషి కొనసాగించడం అవసరం. ఉద్యోగంలో చిక్కుల‌ను అధిగ‌మిస్తారు. కీలమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈ వారం స్థిరమైన వృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగానే ఉన్నప్పటికీ, అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. సంపదలు వృద్ధి చెందుతాయి. ఆప్తుల నుంచి కీల‌క స‌మాచారం అందుతుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చాలావ‌ర‌కు తీరుతాయి. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.

కుంభం (Aquarius)

ఈ వారం అన్ని రంగాల వారికి శుభయోగం ఉంటుంది. ఆశించిన ఫ‌లితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగం, పదవి యోగం కలిగే సూచనలున్నాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిరమైన నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. ధనలాభం సిద్ధిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకున్న ప‌నులు కొంత నెమ్మ‌దిగా పూర్తిచేస్తారు. ప్ర‌ముఖుల ప‌రిచ‌యం సంతోషం క‌లిగిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అభ్యున్నతి ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం (Pisces)

అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. రుణ‌భారాలు కొంత త‌గ్గుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ప్రణాళిక లోపంతో పనులు ఆలస్యం కావచ్చు. ఆత్మవిశ్వాసం అవసరం. వ్యాపారంలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన స‌మాచారం ఊర‌ట‌నిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Advertisement
Advertisement