Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో వారాంతంలో జోష్.. వచ్చే వారం ఎలా ఉంటుంది..?
Gold And Silver Prices Today | గడిచిన వారం మొత్తం అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు, దేశీయ సూచీలు తీవ్ర అస్థిరతతో కొనసాగాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతుండడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. దీంతో ఈక్విటీలు భారీ నష్టాల్లో ముగిశాయి.
Gold And Silver Prices Today | గడిచిన వారం మొత్తం అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు, దేశీయ సూచీలు తీవ్ర అస్థిరతతో కొనసాగాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతుండడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. దీంతో ఈక్విటీలు భారీ నష్టాల్లో ముగిశాయి. దీని ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. ఇటీవలి కాలంలో చాలా కనిష్ట స్థాయిలకు వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగినప్పటికీ యుద్ధ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ లోహాలు కూడా మళ్లీ పెట్టుబడిదారులకు నష్టాలను అందిస్తున్నాయి. గత వారం రోజుల్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ వారాంతంలో ఉత్సాహం కనిపించింది. పెట్టుబడిదారుల్లో కొత్త జోష్ వచ్చింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో శనివారం ఔన్స్ బంగారం ధర 0.59 శాతం మేర ఎగసి 4,376 డాలర్లకు చేరగా, వెండి ధర 0.33 శాతం పెరిగి 64 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1040 పాయింట్లు పెరిగి 1,54,506కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 477 పాయింట్లు పెరిగి 2,35,924కు చేరుకుంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,513 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 104 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,130 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,51,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,100 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,220 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,760గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,22,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,635 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,63,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,300 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
ఆగస్టు 14, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
ఆగస్టు 13, 2026

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు.. బంగారం వైపు పెట్టుబడిదారుల పరుగులు..
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Reliance Industries | అంబానీ కీలక అడుగు.. రోల్స్ రాయిస్‌తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ..
- ●Revanth Reddy | రాష్ట్ర నీటిహక్కుల విషయంలో రాజీపడేది లేదు: సీఎం రేవంత్
- ●1947 ఆగస్టు 15న..మన తెలంగాణలో పసుపు జెండా ఎందుకు ఎగిరింది?
- ●Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి కొత్త అప్డేట్లు.. ధర ఎంతంటే?
- ●TeamIndia | 600వ టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్న గిల్
- ●Independence Day | ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వరుసగా రెండో ఏడాదీ రాహుల్, ఖర్గే గైర్హాజరు

Reliance Industries | అంబానీ కీలక అడుగు.. రోల్స్ రాయిస్‌తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ..

Revanth Reddy | రాష్ట్ర నీటిహక్కుల విషయంలో రాజీపడేది లేదు: సీఎం రేవంత్

1947 ఆగస్టు 15న..మన తెలంగాణలో పసుపు జెండా ఎందుకు ఎగిరింది?

Royal Enfield Continental GT 650 | రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కి కొత్త అప్డేట్లు.. ధర ఎంతంటే?



