త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GDP Growth Rate | త్రైమాసికంలో 7.8శాతం వృద్ధి రేటు.. గ‌ణాంకాలు విడుద‌ల చేసిన కేంద్రం..!

GDP Growth Rate | డిసెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. ఈ మేరకు గణాంకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన ఈ గణాంకాలు కొత్త సిరీస్‌ ప్రకారం వెలువడ్డాయి.

P

Business | Published On Feb 27, 2026, 6.17 pm IST

GDP Growth Rate | త్రైమాసికంలో 7.8శాతం వృద్ధి రేటు.. గ‌ణాంకాలు విడుద‌ల చేసిన కేంద్రం..!
Advertisement

GDP Growth Rate | డిసెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. ఈ మేరకు గణాంకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన ఈ గణాంకాలు కొత్త సిరీస్‌ ప్రకారం వెలువడ్డాయి. ఇప్పటివరకు 2011-12ను ఆధార సంవత్సరంగా తీసుకుంటుండగా, దాన్ని 2022-23కు మార్చిన విషయం తెలిసిందే.

ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు 8.4 శాతంగా నమోదైంది. మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని నిపుణులు అంచనా వేశారు. కొన్ని అంచనాలు 7 శాతం నుంచి 8.7 శాతం వరకు ఉన్నప్పటికీ, వాస్తవంగా నమోదైన 7.8 శాతం వృద్ధి మార్కెట్ అంచనాలను మించిపోయింది. ఇది దేశ ఆర్థిక కార్యకలాపాలు ఊహించిన దానికంటే మెరుగ్గా కొనసాగుతున్నాయని సూచిస్తోంది. ఆ కాలంలో పండుగల సీజన్ ఉండటంతో వినియోగదారుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. వినియోగ వ్యయం పెరగడం ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చింది. వివిధ రంగాల్లో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి, తయారీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. దీని ప్రభావం జీడీపీ వృద్ధిలో స్పష్టంగా ప్రతిబింబించింది.

కొత్త సిరీస్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి సుమారు 7.6 శాతంగా ఉండవచ్చని కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన 7.4 శాతం అంచనాతో పోలిస్తే ఇది అధికం. జులై–సెప్టెంబర్‌ త్రైమాసిక వృద్ధిరేటును 8.2 శాతం నుంచి 8.4 శాతానికి సవరించగా, తొలి త్రైమాసిక వృద్ధిని 7.8 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించారు. తాజా లెక్కింపులో జీఎస్టీ ఆధారిత డేటా, ఇ-వాహనాల లావాదేవీల వివరాలను కూడా చేర్చారు. గృహాల్లో పనిచేసే సిబ్బంది అందించే సేవలను సైతం జీడీపీ లెక్కింపులో భాగంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. మరోవైపు, శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కనిపించాయి. సెన్సెక్స్ 961 పాయింట్లు ప‌త‌న‌మ‌య్యాయి. అయితే, తాజా జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక పరిస్థితిపై స్పష్టతనిస్తున్నాయి.

Advertisement
Advertisement