Damodar Raja Narasimha | ఎయిడ్స్‌కు చెక్.. దేశంలోనే తెలంగాణకు మొదటి స్థానం.. జాతీయ స్థాయి గణాంకాలివే..
Damodar Raja Narasimha | MAS అమలులో దేశంలోనే తెలంగాణ(Telangana)కు ప్రథమ స్థానం దక్కడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు.
- 94 శాతం జిల్లాలకు ‘సురక్షిత్’ హోదా.. 33 జిల్లాల్లో 31 జిల్లాల ఘనత
- అధికారులు, ఆరోగ్య సిబ్బందికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర అభినందన
Damodar Raja Narasimha | త్రినేత్ర న్యూస్: MAS అమలులో దేశంలోనే తెలంగాణ(Telangana)కు ప్రథమ స్థానం దక్కడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 35 శాతం జిల్లాలే ‘సురక్షిత్’ హోదాను సాధించగా, తెలంగాణ 94 శాతం విజయాన్ని నమోదు చేయడం గొప్ప విషయమన్నారు. ఇది జాతీయ సగటు కంటే దాదాపు మూడు రెట్లు అధికమన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో MAS (Mobilization for AIDS Suraksha) కార్యక్రమం అమలవుతున్నట్లు చెప్పారు.
మంత్రి దామోదర ప్రశంసలు
ఈ విజయంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్.చోంగ్తు, రాష్ట్రవ్యాప్తంగా కృషి చేసిన అధికారులను, వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (TGSACS), జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, జిల్లా స్థాయి బృందాలు సమష్టిగా చేసిన కృషిని వారు ప్రశంసించారు.
ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ, హెచ్ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స, సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయాలని, తెలంగాణలోని అన్ని జిల్లాలు 100 శాతం ‘సురక్షిత్’ హోదాను సాధించే దిశగా కృషి చేయాలని సంబంధిత శాఖలు, జిల్లా అధికారులకు వారు పిలుపునిచ్చారు. మిగిలిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు 100 శాతం ‘సురక్షిత్’ హోదాను సాధించేలా ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో తెలంగాణ సాధించిన ఈ ఘనత రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయాలనే జాతీయ లక్ష్య సాధనలో తెలంగాణ తన నిబద్ధతను మరోసారి చాటుకుంది అని మంత్రి దామోదర సంతోషం వ్యక్తం చేశారు.
2026, నవంబర్ 25 నాటికి జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న MAS డ్యాష్‌బోర్డ్ గణాంకాల ప్రకారం తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, జిల్లాల స్థాయిలో జాతీయ హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలులో ఆదర్శంగా నిలిచింది. MAS అనేది NACO ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం. SOCH (Strengthening Overall Care for HIV beneficiaries) డిజిటల్ వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, పరీక్షలు, చికిత్స, సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. జాతీయ స్థాయిలో నిర్దేశించిన 95:95:99 లక్ష్యాల ఆధారంగా ఈ కార్యక్రమం పురోగతిని అంచనా వేస్తారు.
ఈ లక్ష్యాల ప్రకారం..
• హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ హెచ్ఐవీ స్థితి గురించి తెలిసి ఉండాలి
• హెచ్ఐవీ నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందాలి
• చికిత్స పొందుతున్న వారిలో 99 శాతం మందికి వైరల్ సప్రెషన్ సాధించాలి
దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మొదటి ఐదు రాష్ట్రాలు
1. తెలంగాణ - 33 జిల్లాల్లో 31 జిల్లాలు (94%)
2. మహారాష్ట్ర - 36 జిల్లాల్లో 33 జిల్లాలు (92%)
3. పశ్చిమ బెంగాల్ - 23 జిల్లాల్లో 19 జిల్లాలు (83%)
4. అరుణాచల్ ప్రదేశ్ - 27 జిల్లాల్లో 20 జిల్లాలు (74%)
5. తమిళనాడు - 38 జిల్లాల్లో 27 జిల్లాలు (71%)
జాతీయ స్థాయిలో జిల్లాల పనితీరు
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 784 జిల్లాల్లో సాధించిన పురోగతి వివరాలు
• సురక్షిత్ (Surakshit): 273 జిల్లాలు (35%)
• సక్షమ్ (Saksham): 251 జిల్లాలు (32%)
• సంఘర్షశీల్ (Sangharshsheel): 260 జిల్లాలు (33%)
95:95:99 లక్ష్యాల సాధన ఆధారంగా MAS డ్యాష్‌బోర్డ్ జిల్లాలను మూడు విభాగాలుగా వర్గీకరిస్తుంది. మూడు లక్ష్యాలనూ సాధించిన జిల్లాలను ‘సురక్షిత్’గా, రెండు లక్ష్యాలను సాధించిన జిల్లాలను ‘సక్షమ్’గా, ఒకటి లేదా ఏ లక్ష్యాన్నీ సాధించని జిల్లాలను ‘సంఘర్షశీల్’గా గుర్తిస్తారు.
దేశవ్యాప్తంగా కేవలం 35 శాతం జిల్లాలు మాత్రమే ‘సురక్షిత్’ హోదాను సాధించగా, తెలంగాణ రాష్ట్రం 94 శాతం విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఇది జాతీయ సగటు కంటే దాదాపు మూడు రెట్లు అధికం. హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, పరీక్షలు, చికిత్సా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ, సమన్వయం, జిల్లా స్థాయిలో మెరుగైన వైద్య సేవల అందుబాటును కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిరంతర నిబద్ధతకు ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
నవంబర్ 26, 2026

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
నవంబర్ 26, 2026

Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!
నవంబర్ 26, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం
- ●TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!
- ●Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే
- ●Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?
- ●Gabriel India | 10 ఏళ్లలో 12.5 రెట్ల లాభం ఇచ్చిన స్టాక్.. రూ.1 లక్షకు రూ.12.5 లక్షలు..
- ●Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజరు కావాలంటే!

CM Revanth Reddy | డిండి నుంచి ఆ మూడు నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు పారిస్తాం

TTD | ఏమిటా భక్తి.. ఎవరీ వర్ధమాన్ జైన్? తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం ఎందుకిచ్చారంటే!

Mallikarjun Kharge | యూపీ ప్రజలే మోదీ '400 పార్' నినాదానికి అడ్డుకట్ట వేశారు : మల్లికార్జున ఖర్గే

Parliament special session | నవంబర్ 30నే పార్లమెంట్ స్పెషల్ సెషన్?



