PAN Card | పాన్ కార్డును మళ్లీ కొత్తగా పొందాలంటే గందరగోళం వద్దు.. ఇలా చేయండి చాలు..
PAN Card | పాన్ కార్డు ఉన్నవారు దాన్ని మళ్లీ కొత్తగా పొందాలనుకుంటే తీవ్ర గందరగోళానికి గురవుతుంటారు. పాన్ కోర్డు పోయినా, దెబ్బ తిన్నా లేదా దానిపై ఉండే అక్షరాలు, ఫొటో వంటివి సరిగ్గా కనిపించకపోయినా తప్పనిసరిగా మళ్లీ కొత్త కార్డును పొందాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు.
PAN Card | పాన్ కార్డు ఉన్నవారు దాన్ని మళ్లీ కొత్తగా పొందాలనుకుంటే తీవ్ర గందరగోళానికి గురవుతుంటారు. పాన్ కోర్డు పోయినా, దెబ్బ తిన్నా లేదా దానిపై ఉండే అక్షరాలు, ఫొటో వంటివి సరిగ్గా కనిపించకపోయినా తప్పనిసరిగా మళ్లీ కొత్త కార్డును పొందాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. పాన్ కార్డును మళ్లీ కొత్తగా ఎలా తీసుకోవాలి..? అని ఆలోచిస్తుంటారు. కానీ పలు సింపుల్ స్టెప్స్‌ను పాటిస్తే పాన్ కార్డును మళ్లీ కొత్తగా చాలా సులభంగా పొందవచ్చు. ఓ సులభమైన విధానాన్ని పాటించడం ద్వారా మీ పని చాలా తేలిగ్గా పూర్తవుతుంది.
వివరాలను సరిపోల్చాలి..
పాన్ కార్డును మళ్లీ కొత్తగా పొందేందుకు కావల్సిన పత్రాలను ముందుగా సిద్ధం చేసుకోవాలి. సాధారణంగా ఇందుకు గాను ఫొటో ఐడీ కార్డు, అడ్రస్ ఐడీ కార్డు, బర్త్ డేట్ కన్ఫర్మేషన్ వంటి పత్రాలు అవసరం అవుతాయి. వీటిని సిద్ధం చేసుకుంటే ఈ పత్రాలతో పాన్ కార్డును మళ్లీ పొందవచ్చు. సాధారణంగా ఈ పత్రాల్లో ఉండే వివరాలతో మీ పాన్ కార్డులోని వివరాలను సరిపోలుస్తారు. దీంతో కార్డును మళ్లీ జనరేట్ చేసి ఇస్తారు. అయితే ఆయా పత్రాల్లో ఉండే వివరాలు మీ ప్రస్తుత పాన్ కార్డులో ఉండే వివరాలతో సరిపోలుతున్నాయా, లేదా అన్నది ముందుగా మీరు నిర్దారించుకోవాలి. లేదంటే మీ పాన్ కార్డు అప్లికేషన్‌ను తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. అన్ని వివరాలను వెరిఫై చేసుకున్నాకే పాన్ కార్డును మళ్లీ కొత్తగా తీసుకునేందుకు అప్లై చేయాలి. దీంతో ప్రక్రియ చాలా సులభంగా, వేగంగా కొనసాగుతుంది. మధ్యలో ఎలాంటి అవాంతరాలు రావు.
డిజిటల్ విధానం అయితేనే మేలు..
పాన్ కార్డును మళ్లీ కొత్తగా పొందేందుకు గాను మీరు పాన్ కార్డు రెన్యువల్ ఫామ్‌ను రెండు రకాలుగా అప్లై చేయవచ్చు. ఒకటి డిజిటల్ విధానం కాగా, రెండోది ఆఫ్‌లైన్ విధానం. డిజిటల్ విధానంలో అయితే అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లోనే సమర్పిస్తారు కనుక ఈ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుంది. అదే ఆఫ్ లైన్‌లో అయితే అన్ని పత్రాలను పాన్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. కనుక ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అందువల్ల డిజిటల్ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో పాన్ రెన్యువల్ వేగంగా పూర్తవుతుంది. ఇందుకు గాను పాన్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా వివరాలను నింపాలి. ఆ తరువాత అవసరమైన పత్రాలకు చెందిన స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి. అనంతరం సబ్‌మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దీంతో పాన్ రెన్యువల్ ఫామ్ విజయవంతంగా సమర్పించబడుతుంది. ఆ తరువాత కొన్ని రోజుల్లోనే పాన్ మళ్లీ కొత్తగా జనరేట్ అవుతుంది. భౌతిక పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. డిజిటల్ కార్డును మీ మెయిల్‌కు పంపిస్తారు. లేదా పాన్ వెబ్‌సైట్ నుంచి కూడా కొత్త కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తప్పులు దొర్లవద్దు..
ఇక పాన్ కార్డును మళ్లీ కొత్తగా పొందేందుకు అప్లై చేసే ఫామ్‌లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా పేర్లు, తేదీలు, చిరునామాల్లో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. లేదంటే పాన్ కార్డు ఫామ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఫామ్‌ను సమర్పించే ముందు ఒకసారి అన్ని వివరాలను మళ్లీ పునఃపరిశీలించుకోవడం ముఖ్యం. దీంతో చివరి నిమిషంలోనూ అయినా సరే ఏవైనా తప్పులు ఉంటే సులభంగా తెలిసిపోతాయి. దీని వల్ల వాటిని వెంటనే సరిచేసుకోవచ్చు. ఈ క్రమంలో మీ పాన్ కార్డు మళ్లీ ఆమోదం పొందేందుకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక మీ పాన్ కార్డును రెన్యువల్ చేసుకుని మళ్లీ కొత్తగా పొందే క్రమంలో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ఏ విధానంలో అయినా సరే నిర్దిష్టమైన మొత్తంలో ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇది పాన్ కార్డును బట్టి ఉంటుంది. అయితే డిజిటల్ రూపంలో పాన్ రెన్యువల్‌కు దరఖాస్తు చేస్తే ఫీజు మొత్తాన్ని మనం ఇష్టం వచ్చిన విధానంలో చెల్లించవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అయితే ఫీజు చెల్లింపు విజయవంతం అయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాన్ ను పొందడంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించవచ్చు.
అక్‌నాలెడ్జ్‌మెంట్ కీలకం..
పాన్ కార్డును పొందేందుకు దరఖాస్తును సమర్పించిన అనంతరం మీకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్‌ల ద్వారా దరఖాస్తు ఫాం వారికి అందినట్లు అక్‌నాలెడ్జ్‌మెంట్ పత్రాన్ని నంబర్‌తో సహా ఇస్తారు. దాన్ని భవిష్యత్ అవసరాలకు మీరు భద్ర పరుచుకోవాల్సి ఉంటుంది. మీకు పాన్ కార్డు చేతిలో పడే వరకు ఆ పత్రాన్ని ఎక్కడైనా సేవ్ చేసి పెట్టాలి. దీని వల్ల మీకు పాన్ రావడం ఆలస్యం అయితే ఆ పత్రంలో ఉన్న నంబర్‌తో మీరు పాన్ కార్డు వెబ్‌సైట్ లో ఫిర్యాదు చేయవచ్చు. దీంతో మీకు పాన్ కార్డును పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను సులభంగా దాటవచ్చు. ఇక కొన్ని సార్లు పాన్‌ను ఇచ్చే సమయంలో అధికారులు మీ నుంచి మరింత సమాచారాన్ని అడిగే అవకాశం ఉంటుంది. ఇలా అరుదుగా జరుగుతుంది. కానీ వారు అడిగిన సమాచారాన్ని పత్రాల రూపంలో ఇవ్వడం మరిచిపోవద్దు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తూ పాన్ రెన్యువల్‌కు దరఖాస్తు చేస్తే చాలా సులభంగా, వేగంగా పాన్ కార్డు మళ్లీ మీకు లభిస్తుంది. దీని వల్ల మీకు పాన్ విషయంలో నిర్వహించే లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

SEBI | విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. పాన్ అప్లికేషన్ నిబంధనలు సడలింపు..
మే 16, 2026

PAN | పాన్ అంటే కేవలం ఐటీ రిటర్న్స్ కు మాత్రమే కాదు, ఈ సందర్భాల్లోనూ వివరాలను ఇవ్వాల్సిందే
ఏప్రిల్ 19, 2026

PAN Card | ఇకపై పాన్ కార్డును పొందడం కష్టమే.. మార్చి 31 తరువాత నుంచి కొత్త రూల్స్..
మార్చి 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



