PAN | పాన్ కార్డు నంబర్‌కు అసలు అర్థం ఏమిటి..? ఆ అక్షరాలు, నంబర్లను ఎలా అర్థం చేసుకోవాలి..?
PAN కార్డు అంటే Permanent Account Number అనే అర్థం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ కార్డును అనేక పనులకు ఉపయోగిస్తుంటారు. ఆర్థిక లావాదేవీలతోపాటు ఆదాయం లేదా ఇతర పన్ను చెల్లింపులకు, ప్రభుత్వ పథకాలను పొందేందుకు పాన్ కార్డులను వాడుతారు.
PAN కార్డు అంటే Permanent Account Number అనే అర్థం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ కార్డును అనేక పనులకు ఉపయోగిస్తుంటారు. ఆర్థిక లావాదేవీలతోపాటు ఆదాయం లేదా ఇతర పన్ను చెల్లింపులకు, ప్రభుత్వ పథకాలను పొందేందుకు పాన్ కార్డులను వాడుతారు. దేశంలోని ప్రతి పౌరుడు కచ్చితంగా పాన్ కార్డును వాడాల్సి ఉంటుంది. అది లేకపోతే బ్యాంకుల్లో అకౌంట్లను ఓపెన్ చేయడం కూడా కష్టంగా మారుతుంది. అయితే పాన్ కార్డుపై ఉండే నంబర్లను మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా..? కొన్ని రకాల ఆంగ్ల అక్షరాలు, అంకెలు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. అయితే అందరి పాన్ కార్డులపై ఈ నంబర్లు, అక్షరాలు ఒకేలా ఉండవు. భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే అసలు ఏ సిరీస్ ప్రకారం ఈ నంబర్లు లేదా అక్షరాలను పాన్ కార్డులపై ప్రింట్ చేస్తారు..? అసలు వాటి అర్థం ఏమిటి..? వాటిని అలాగే ఎందుకు ప్రింట్ చేస్తారు..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కో అక్షరం ఒక్కో అర్థాన్నిస్తుంది..
పాన్ కార్డుపై ఉండే 10 అంకెలు, అక్షరాల కోడ్ ను యాదృచ్ఛికంగా ఏ అంకె పడితే ఆ అంకెతో, ఏ అక్షరం పడితే అక్షరంతో ముద్రించరు. అందుకు ఒక పద్ధతి ఉంటుంది. పాన్ కార్డును ఒకసారి పరిశీలిస్తే అందులో మొదటి మూడు స్థానాల్లో ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. అది ఒక సిరీస్‌గా గుర్తించబడుతుంది. ఒక సిరీస్ అయ్యాక ఇంకో సిరీస్‌లో ఆయా అక్షరాలను తీసుకుని పాన్ కార్డులను ముద్రిస్తారు. ఇక పాన్ కార్డు నంబర్‌లో ఉండే తరువాతి ఆంగ్ల అక్షరం వ్యక్తిగత పాన్ కార్డా లేక బిజినెస్‌కు చెందిన పాన్ కార్డా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తరువాత ఉండే మరో ఆంగ్ల అక్షరం కార్డు హోల్డర్‌కు చెందిన ఇంటిపేరులోని మొదటి ఆంగ్ల అక్షరాన్ని సూచిస్తుంది. ఆ తరువాత ఉండే నాలుగు అంకెలను ఆ పాన్ కార్డుకు చెందిన సీరియల్ నంబర్‌గా భావించాలి. ఇక చివర్లో ఉండే మరో ఆంగ్ల అక్షరం పాన్ కార్డు అసలుదా, నకిలీదా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ వారు గుర్తించగలుగుతారు. ఇతరులకు ఆ అవకాశం ఉండదు. ఇలా పాన్ కార్డు నంబర్‌కు అర్థం వస్తుంది.
ఉదాహరణ చెబితే..
ఉదాహరణ తీసుకుంటే.. ఒక వ్యక్తి పాన్ కార్డు ABCPK1234D అనుకుంటే అందులో మొదటి మూడు అక్షరాలు ABC ఒక సిరీస్‌ను సూచిస్తాయి. అంటే ఆ కార్డును ఆ సిరీస్‌లో ప్రింట్ చేశారని అర్థం. ఆ తరువాత ఉండే P అనే అక్షరం ఆ పాన్ కార్డు ఒక వ్యక్తికి చెందుతుందని సూచిస్తుంది. ఆ తరువాత ఉండే K అనే అక్షరం ఆ వ్యక్తికి చెందిన ఇంటి పేరులోని మొదటి ఆంగ్ల అక్షరాన్ని సూచిస్తుంది. ఇక ఆ తరువాత ఉండే 1234 అనే నాలుగు అంకెలు ఆ పాన్ కార్డు సీరియల్ నంబర్‌ను తెలియజేస్తాయి. చివర్లో ఉండే D అనే అక్షరం ఆ పాన్ కార్డు అసలుదేనా, నకిలీదా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఈ అక్షరం ద్వారా నకిలీ పాన్ కార్డులను గుర్తిస్తారు. ఇలా పాన్ నంబర్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

SEBI | విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. పాన్ అప్లికేషన్ నిబంధనలు సడలింపు..
మే 16, 2026

PAN | పాన్ అంటే కేవలం ఐటీ రిటర్న్స్ కు మాత్రమే కాదు, ఈ సందర్భాల్లోనూ వివరాలను ఇవ్వాల్సిందే
ఏప్రిల్ 19, 2026

TDS | మీకు లభించే వడ్డీపై బ్యాంకు టీడీఎస్ కట్ చేసిందా..? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



