PAN-Aadhaar Link | డిసెంబరు 31లోపు పాన్ – ఆధార్ లింక్ చేయకపోతే భారీ జరిమానా
నిజానికి జూన్ 30, 2023 వరకు మాత్రమే పాన్-ఆధార్ లింక్‌కి డెడ్ లైన్ ఉండేది. కానీ.. దాన్ని వెయ్యి రూపాయల ఫైన్‌తో మే 31, 2024 వరకు పొడిగించారు. ఇప్పటికీ చేసుకోని వాళ్లు వెయ్యి ఫైన్‌తో లింక్ చేసుకోవచ్చు.
PAN-Aadhaar Link | మీకు పాన్ కార్డు ఉందా? ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారా? మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకున్నారా? ఇప్పటికే లింక్ చేసుకుంటే ఓకే కానీ.. ఇప్పటి వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోని వాళ్లు ఎవరైనా ఉంటే వచ్చే మూడు రోజుల్లో లింక్ చేసుకోండి. డిసెంబర్ 31 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోండి. లేదంటే భారీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 3, 2025 న ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 1, 2024 కంటే ముందు ఎవరైతే తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ కార్డు తీసుకుంటే వాళ్లు ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలి. అంటే డిసెంబర్ 31, 2025 లోపు అన్నమాట.
భారత పన్ను చట్టాల ప్రకారం పాన్- ఆధార్ లింక్ అనేది కంపల్సరీ అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) స్పష్టం చేసింది. ఆధార్ నెంబర్ కాకుండా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ కార్డు తీసుకున్నవాళ్లు ఖచ్చితంగా డిసెంబర్ 31, 2025 లోపు పర్మినెంట్ ఆధార్ నెంబర్‌తో పాన్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోకపోతే జనవరి 1, 2026 నుంచి వాళ్ల పాన్ కార్డు పని చేయదు. పాన్ కార్డును తమ ఆర్థిక లావాదేవీలకు వాడేవారు, టాక్స్ సంబంధిత పనుల కోసం వాడేవాళ్లు పాన్ పనిచేయకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
PAN-Aadhaar Link | వెయ్యి పెనాల్టీతో ఇప్పటి వరకు అవకాశం
నిజానికి జూన్ 30, 2023 వరకు మాత్రమే పాన్-ఆధార్ లింక్‌కి డెడ్ లైన్ ఉండేది. కానీ.. దాన్ని వెయ్యి రూపాయల ఫైన్‌తో మే 31, 2024 వరకు పొడిగించారు. ఇప్పటికీ చేసుకోని వాళ్లు వెయ్యి ఫైన్‌తో లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ పాన్ కార్డు పని చేయకపోతే భవిష్యత్తులో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు. రిఫండ్స్ రావు. టీడీఎస్ లేదా టీసీఎస్ చార్జీలు అధికంగా ఉంటాయి. 15జీ, 15హెచ్ లాంటి ఫామ్స్ రిజెక్ట్ అవుతాయి. బ్యాంకులు కూడా పాన్-ఆధార్ లింక్ కాని ఖాతాల సర్వీసులను నిలిపివేస్తాయి.
సంబంధిత వార్తలు

Income Tax Department | మీ సేవింగ్స్ అకౌంట్‌పై ‘ఐటీ’ కన్ను.. ఈ 10 లావాదేవీలు చేస్తే నోటీసులు గ్యారెంటీ..
మే 21, 2026

SEBI | విదేశీ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. పాన్ అప్లికేషన్ నిబంధనలు సడలింపు..
మే 16, 2026

ITR Filing 2026 | ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం.. ఐటీఆర్-1, ఐటీఆర్-4 యుటిలిటీస్ విడుదల..
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



