Bhogi Fruits | భోగి నాడు చిన్నారులపై భోగి పండ్లను ఎందుకు పోస్తారు..?
Bhogi Fruits | సంక్రాంతి సంబురాలను ప్రజలు దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. భోగి పండుగ నేపథ్యంలో వాడవాడలా భోగి మంటలను వేసి సంక్రాంతి వేడుకలకు స్వాగతం పలికారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య కాలం కావడంతో సంక్రాంతి సంబురాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు.
Devotional | Published On Jan 14, 2026, 8.04 am IST
Bhogi Fruits | సంక్రాంతి సంబురాలను ప్రజలు దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. భోగి పండుగ నేపథ్యంలో వాడవాడలా భోగి మంటలను వేసి సంక్రాంతి వేడుకలకు స్వాగతం పలికారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య కాలం కావడంతో సంక్రాంతి సంబురాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే తొలి రోజు భోగి పండుగ మొదలవుతుంది. ఉదయం ముందుగా భోగి మంటలను వేస్తారు. మనసులో ఉండే ముతక ఆలోచనలు, నెగెటివ్ భావజాలం, చెడు అలవాట్లు, కోపం, ద్వేషం, స్వార్థం, కపటం వంటి మాలిన్యాలను దహింపజేయాలని, ఈ సంవత్సరంలో అంతా మంచే జరగాలని, అభివృద్ధి చెందాలని, సర్వ శుభాలు జరగాలని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటలను వేయడం వల్ల గాలిలో ఉండే సూక్ష్మ జీవులు తొలగిపోయి వాతావరణం శుద్ధి అవుతుందని కూడా భావిస్తారు. అయితే భోగి సందర్భంగా సాయంత్రం సమయంలో చిన్నారులపై భోగి పండ్లను కూడా పోస్తుంటారు.
శ్రీమహావిష్ణువు ఆశీస్సుల కోసమే..
రేగుపండ్లు, పువ్వులు, చిల్లర నాణేల, అక్షతలు, కలిపి చిన్నారులపై పోసే ప్రక్రియను భోగి పండ్లు పోయడం అంటారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అందరూ దీవెనలను అందిస్తారు. భోగి పండ్లు పోయడం వారికి రక్షణ కల్పిస్తుందని విశ్వసిస్తారు. రేగు పండ్లను బదరీ ఫలాలని పిలుస్తారు. ఇవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ క్రమంలో ఈ పండ్లను చిన్నారుల తలపై పోస్తే వారికి ఆయన ఆశీస్సులు దండిగా లభిస్తాయని విశ్వసిస్తారు. అలాగే చిన్నారులపై ఉండే దిష్టి కూడా పోతుందని భావిస్తారు. పండుగ సమయంలో అందరూ కలసి మెలసి ఉండాలనే విషయాన్ని కూడా బోగి పండ్ల కార్యక్రమం మనకు తెలియజేస్తుంది. కనుకనే భోగి పండుగ నాడు చిన్నారులపై భోగి పండ్లను పోయడం ఆనవాయితీగా వస్తోంది.
బ్రహ్మ రంధ్రాన్ని ఉత్తేజితం చేయడం కోసం..
భోగి పండ్ల కార్యక్రమాన్ని నిర్వహించడం వెనుక ఓ కథ కూడా ఉందని చెబుతారు. పురాణాలు చెబుతున్న ప్రకారం శివుడి కోసం ఓసారి నరనారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన దేవతలు వారిపై బదరీ ఫలాలను అంటే రేగు పండ్లను వర్షంలా కురిపించారు. అందువల్ల పిల్లలను నారాయణుడిలా భావించి సంక్రాంతి ముందు రోజు.. అంటే భోగి నాడు రేగు పండ్లను ఇలా భోగిపండ్లుగా పోసే సంప్రదాయం మొదలైందని చెబుతారు. అలాగే చిన్నారులకు తల మెత్తగా ఉంటుంది. ఈ క్రమంలో దాన్ని బ్రహ్మ రంధ్రంగా కూడా చెబుతారు. అందువల్ల రేగు పండ్లను తలపై పోస్తే వాటి నుంచి వచ్చే వాసనలు బ్రహ్మ రంధ్రాన్ని ప్రేరేపిస్తాయి. దీని వల్ల చిన్నారుల్లో జ్ఞానం పెరుగుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సితోపాటు ఇతర సమ్మేళనాలు చిన్నారుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆ పండ్లను వారు ఎంతో ఇష్టంగా తింటారు. దీని వల్ల వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా రేగు పండ్లు వారికి మేలు చేస్తాయి. ఇలా ఆయా కారణాల వల్ల చిన్నారులపై భోగి నాడు భోగి పండ్లను పోయడాన్ని పాటిస్తూ వస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | డీ గ్లామర్ లుక్లో అనుపమ – శర్వానంద్ భోగి నుంచి సర్ప్రైజ్ అప్డేట్
ఏప్రిల్ 30, 2026

Sharwanand | యాక్షన్ షెడ్యూల్లో శర్వానంద్ భోగి – పుష్ప 2 సెంటిమెంట్ ప్లేస్లో షూటింగ్
ఏప్రిల్ 14, 2026

Bhogi | ఆగస్టు 28న శర్వా యాక్షన్ డ్రామా..! పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న భోగీ..!
ఫిబ్రవరి 25, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



