Stock Markets | వాల్ స్ట్రీట్ నష్టాల ప్రభావం.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
Stock Markets | అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం భారత మార్కెట్లపై ప్రభావం చూపడంతో బుధవారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఎన్విడియా అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, రూపాయి బలపడడం మార్కెట్లకు కొంత మద్దతునిచ్చాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Stock Markets | అమెరికా స్టాక్ మార్కెట్ల పతనం భారత మార్కెట్లపై ప్రభావం చూపడంతో బుధవారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఎన్విడియా అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, రూపాయి బలపడడం మార్కెట్లకు కొంత మద్దతునిచ్చాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్వల్ప నష్టాల్లో సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. మంగళవారం 82,532.19 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం ఉదయం 82,376.56 వద్ద ప్రారంభమై, ఉదయం 9.20 గంటల సమయానికి 69.06 పాయింట్లు (0.08 శాతం) నష్టంతో 82,463.13 వద్ద కొనసాగింది. అలాగే మంగళవారం 25,387.40 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, బుధవారం 25,323.15 వద్ద ప్రారంభమై 26.65 పాయింట్లు (0.10 శాతం) నష్టంతో 25,360.75 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ సూచీలు బలహీనంగా ప్రారంభమైనప్పటికీ, ఎన్విడియా అంచనాలను మించిన ఫలితాలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి.
లాభాల్లో హెల్త్ కేర్ షేర్లు..
ప్రారంభ ట్రేడింగ్‌లో హెల్త్‌కేర్ షేర్లు లాభాల బాట పట్టాయి. అపోలో హాస్పిటల్స్ 1.84 శాతం పెరిగి రూ.8,872.50కు, మ్యాక్స్ హెల్త్ 0.83 శాతం పెరిగి రూ.1,039.50కు చేరాయి. ఎస్‌బీఐ 0.58 శాతం, మారుతీ సుజుకీ 0.53 శాతం, బీఎస్ఈ షేరు 0.61 శాతం లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 1.64 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.55 శాతం, హిండాల్కో 1.51 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.41 శాతం, టైటాన్ 1.34 శాతం నష్టపోయాయి. మంగళవారం బ్యాంక్ నిఫ్టీ 697 పాయింట్లు (1.13 శాతం) పెరిగి 62,273.25 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 62,442 పాయింట్ల సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) వరుసగా ఆరో సెషన్‌లోనూ కొనుగోళ్లు కొనసాగించి రూ.4,195 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) కూడా 12 సెషన్ల వరుస అమ్మకాలకు ముగింపు పలికి రూ.196 కోట్ల నికర కొనుగోళ్లు చేపట్టారు. నవంబర్‌లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారుల మొత్తం పెట్టుబడుల ప్రవాహం రూ.94,450 కోట్లకు చేరింది. మరోవైపు మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 45 పైసలు బలపడి రూ.93.47కు చేరింది. ఇది ఏడు నెలల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..
నవంబర్ 20, 2026

Nifty Bank | బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ.. సరికొత్త మైలురాయికి చేరిన బ్యాంక్ నిఫ్టీ సూచీ..
నవంబర్ 20, 2026

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
- ●Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?
- ●TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Nishikant Dubey | విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Sugar Free Mithai | షుగర్ ఫ్రీ స్వీట్లు తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందా?

TG SAFE Rides | హైదరాబాద్ రెస్టారెంట్లపై అధికారుల రైడ్స్.. ఆ హోటళ్ల నుంచి ఆన్లైన్ డెలివరీ బంద్!

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు



