Ethanol Blending in India | పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్.. భారత్ భారీ సక్సెస్.. వాహనాల్లో దీన్ని వాడొచ్చా?
గత కొన్నేళ్ల నుంచి ఇథనాల్ వాడినా నడిచేలా వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. బీఎస్6 ఫేజ్ 2 స్టాండర్డ్ వాహనాలు, E20 స్టిక్కర్ ఉన్న వాహనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ని వాడొచ్చు.
Ethanol Blending in India | రోజురోజుకూ వాహనాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఈవీల జనరేషన్ వచ్చినా రోడ్ల మీద కనిపించే 10 కార్లలో 7 నుంచి 8 వరకు పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లే కనిపిస్తాయి. ఒకటో రెండో ఈవీ కార్లు కనిపిస్తాయి. దానికి కారణం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకు డిమాండ్ ఉండటమే. కానీ.. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికీ భారత్.. పెట్రోల్, డీజిల్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తోంది. అందుకే.. భారత ఇంధన రంగంలో సరికొత్త మార్పులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ని కలిపే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(EBP) ప్రోగ్రామ్ ఊపందుకుంది.

E20 లక్ష్యంగా
కేంద్రం E20 పేరుతో 20 శాతం ఇథనాల్ సరఫరా లక్ష్యాన్ని 2025-26 నాటికి చేరుకునేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇథనాల్ సరఫరా 19 శాతానికి చేరుకుంది. గత ఐదేళ్ల డేటా చూస్తే 8.10 శాతం నుంచి 19.24 శాతానికి పెరిగింది. నిజానికి బ్రెజిల్ లాంటి దేశాలు గత 20 ఏళ్లలో ఈ వృద్ధిని చూస్తే.. భారత్ మాత్రం 7 నుంచి 8 ఏళ్లలోనే ఇథనాల్ సరఫరాను సాధించింది.

ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది
ఇథనాల్ బ్లెండింగ్ ఎంత పెంచితే.. భారత్ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం అంత తగ్గుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇథనాల్ బ్లెండింగ్‌పై పార్లమెంట్‌లో వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల గత కొన్నేళ్లలో దేశానికి రూ.1,55,000 కోట్ల విలువైన ఫారెక్స్ మనీ ఆదా అయిందన్నారు.

భారత్‌కి మూడో స్థానం
ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో 52 శాతం ఉత్పత్తితో అమెరికా ఉండగా, రెండో స్థానంలో 28.1 శాతంతో బ్రెజిల్ ఉంది.
ఇథనాల్ ఉత్పత్తి కోసం మన దేశంలో చెరుకుతో పాటు మొక్కజొన్న, బియ్యం కూడా ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్నను 46 శాతం ఉపయోగిస్తుండగా, బియ్యం 22 శాతం, ఇంకా ఇతర ఆహార ధాన్యాలను ఉపయోగించి ఇథనాల్‌ని తయారు చేస్తున్నారు.

వాహనాల ఇంజిన్ మాటేమిటి?
పెట్రోల్, డీజిల్‌తో నడిచేలా మాత్రమే ఇప్పటి వరకు వాహనాలు తయారు చేయబడ్డాయి. మరి.. ఇథనాల్ కలిసిన పెట్రోల్‌ని పోస్తే వాహనాలు నడుస్తాయా? వాటి మైలేజ్ మాటేంటి? వాటి ఇంజిన్ పాడవుతుంది కదా అనే ఆందోళన ప్రతి ఒక్క వాహనదారుడిలోనూ ఉంది. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ సమావేశాల్లోనే క్లారిటీ ఇచ్చారు.

కొన్ని సంస్థల అధ్యాయనాల ప్రకారం ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ వల్ల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంజిన్ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదన్నారు. మైలేజ్ విషయంలో మాత్రం స్వల్ప తగ్గుదల ఉండే చాన్స్ ఉందని స్పష్టం చేశారు.
గత కొన్నేళ్ల నుంచి ఇథనాల్ వాడినా నడిచేలా వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. బీఎస్6 ఫేజ్ 2 స్టాండర్డ్ వాహనాలు, E20 స్టిక్కర్ ఉన్న వాహనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ని వాడొచ్చు.
(Photos Courtesy - NDTV)
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





