త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPF Withdraw | ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ విత్ డ్రా..

EPF Withdraw | ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) త‌న చందాదారుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)ను యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి విత్ డ్రా చేసుకునేందుకు వీలు క‌ల్పించ‌నుంది. ఇప్ప‌టికే ఈపీఎఫ్ విత్ డ్రాపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వియా కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు.

S

Business | Published On Jan 17, 2026, 7.42 am IST

EPF Withdraw | ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇక‌పై యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ విత్ డ్రా..
Advertisement

EPF Withdraw | ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్‌వో) త‌న చందాదారుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)ను యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి విత్ డ్రా చేసుకునేందుకు వీలు క‌ల్పించ‌నుంది. ఇప్ప‌టికే ఈపీఎఫ్ విత్ డ్రాపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వియా కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు. చందాదారులు త‌మ ఈపీఎఫ్‌ను ఇక‌పై ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే వీలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ స‌దుపాయాన్ని అందిస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. కానీ దాంతోపాటు యూపీఐ ద్వారా కూడా ఈపీఎఫ్ విత్ డ్రాకు అవ‌కాశం క‌ల్పించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అందువ‌ల్ల ఈపీఎఫ్‌వో చందాదారులు ఈ రెండు మార్గాల్లో త‌మ‌కు అనుకూల‌మైన విధానం ద్వారా డ‌బ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలు ఉంటుంది.

ప్ర‌స్తుతం ఉద్యోగులు పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు గాను క్లెయిమ్ ఫామ్స్‌ను స‌మ‌ర్పించి న‌గ‌దు విత్ డ్రా కోసం రోజుల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి వ‌స్తోంది. అయితే ఈ విధానానికి ఇక స్వ‌స్తి ప‌ల‌క‌నున్నారు. కొత్త విధానంలో యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ విత్ డ్రాకు అవ‌కాశం క‌ల్పిస్తారు. దీంతో చాలా సుల‌భంగా న‌గ‌దును విత్ డ్రా చేయ‌వ‌చ్చు. కేవ‌లం కొన్ని నిమిషాల్లోనే ఈపీఎఫ్ న‌గ‌దు విత్ డ్రా అవుతుంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇది ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే ఈ కొత్త విధానం ఏప్రిల్ నుంచి అమ‌లులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా ఏటీఎం సౌక‌ర్యం క‌ల్పించాక యూపీఐ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిసింది. యూపీఐ ద్వారా అయితే అప్ప‌టిక‌ప్పుడు క్ష‌ణాల్లో ఈపీఎఫ్ న‌గ‌దు బ్యాంక్ అకౌంట్‌కు బ‌దిలీ అవుతుంది. దీని వ‌ల్ల చందాదారులు త‌మ‌కు కావ‌ల్సిన బ్యాంకు అకౌంట్ ద్వారా న‌గ‌దును విత్ డ్రా చేసుకోవ్చు. ఇక కొత్త విధానంలో భాగంగా చందాదారులు న‌గ‌దును విత్ డ్రా చేస్తే అందులో కొంత భాగాన్ని మిన‌హాయించుకుంటారు. ఆ త‌రువాత మిగిలిన మొత్తాన్ని ఇస్తారు. ఈ క్ర‌మంలో ఈపీఎఫ్‌కు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ ద్వారా ఎంత మొత్తంలో న‌గ‌దు విత్‌డ్రాకు సిద్ధంగా ఉందో తెలుసుకోవ‌చ్చు. దీంతో చందాదారుల‌కు త‌మ పీఎఫ్ సొమ్ములో ఎంత మిన‌హాయించుకుని, ఎంత మొత్తాన్ని ఇస్తారు.. అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఉంటుంది. అయితే యూపీఐ ద్వారా పీఎఫ్‌ను విత్ డ్రా చేస్తే ఆ స‌మ‌యంలో క‌చ్చితంగా పిన్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ వివ‌రాల‌ను కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement