Air Traffic | జూన్‌లో 12శాతం డొమెస్టిక్ ట్రాఫిక్ డౌన్..!
Air Traffic | దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య జూన్‌లో దాదాపు 12 శాతం తగ్గింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. మేలో 1.53 కోట్ల మంది ప్రయాణించగా, జూన్‌లో ఈ సంఖ్య 1.35 కోట్లకు పడిపోయింది. గతేడాది జూన్‌లో నమోదైన 1.36 కోట్ల ప్రయాణికులతో పోలిస్తే తగ్గింది స్వల్పమేనని డీజీసీఏ అధికారులు తెలిపారు.
Air Traffic | దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య జూన్‌లో దాదాపు 12 శాతం తగ్గింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. మేలో 1.53 కోట్ల మంది ప్రయాణించగా, జూన్‌లో ఈ సంఖ్య 1.35 కోట్లకు పడిపోయింది. గతేడాది జూన్‌లో నమోదైన 1.36 కోట్ల ప్రయాణికులతో పోలిస్తే తగ్గింది స్వల్పమేనని డీజీసీఏ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు డిమాండ్ తక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. ఇదిలా ఉండగా.. మార్కెట్‌లో ఇండిగో తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. మే నెలలో 64.9 శాతంగా ఉన్న వాటా జూన్‌లో 66.3 శాతానికి పెరిగింది. ఎయిర్ ఇండియా గ్రూప్ వాటా 25.6 శాతం నుంచి 23.9 శాతానికి పడిపోయింది. ఇక ఆకాసా ఎయిర్ వాటా 5.8 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ వాటా 2.5 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది.
2026 జనవరి నుంచి జూన్ వరకు దేశీయ విమానయాన సంస్థలు 8.64 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1.44 శాతం వృద్ధి సాధించాయి. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడంతో పలు కంపెనీలు తాత్కాలికంగా సర్వీసులను తగ్గించిన విషయం తెలిసిందే. ఇక సమయపాలన విషయంలో ఇండిగో 89.4 శాతంతో టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఎయిర్ ఇండియా గ్రూప్ 85.9 శాతం, ఆకాసా ఎయిర్ 82.7 శాతం, అలయన్స్ ఎయిర్ 74.7 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్పైస్‌జెట్ పనితీరు 33.5 శాతంగా ఉన్నది. మరో వైపు విమాన క్యాన్సలేషన్ రేటు జూన్‌లో 0.63 శాతంగా ఉంది. విమానాలను రద్దు చేయడం వల్ల 43,968 మంది ప్రయాణికులకు ప్రభావితమయ్యారు. వారికి రూ.61.98 లక్షల పరిహారంతో పాటు పలు సౌకర్యాలు కల్పించారు. విమానాల ఆలస్యంతో 1,10,273 మంది ప్రయాణికులు ప్రభావితం కాగా.. వారికి రూ.2.85 కోట్ల విలువైన సదుపాయాలు కల్పించారు. బోర్డింగ్ 1,847 మందికి బోర్డింగ్ నిరాకరించగా.. వారికి రూ.64.84 లక్షల పరిహారాన్ని ఎయిర్‌లైన్స్ అందించాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ
- ●TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
- ●National Honour (Amendment) Bill | వందేమాతరం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
- ●E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ..!
- ●Google | ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్‌ను లాంచ్ చేసిన గూగుల్.. యూజర్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది..
- ●AK47 | 'ఆదర్శ కుటుంబం'లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!

Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..

National Honour (Amendment) Bill | వందేమాతరం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ..!





