Cigarette Rates | ధూమపాన ప్రియులకు మళ్లీ షాక్.. పెరగనున్న సిగరెట్ల ధరలు..
Cigarette Rates | భారత సిగరెట్ మార్కెట్‌లో కంపెనీలు మరోమారు ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఐటీసీ లిమిటెడ్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలు మే నెల నుంచి సుమారుగా 17 శాతం మేర సిగరెట్ ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు ఇప్పటికే తమ తమ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Cigarette Rates | భారత సిగరెట్ మార్కెట్‌లో కంపెనీలు మరోమారు ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఐటీసీ లిమిటెడ్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలు మే నెల నుంచి సుమారుగా 17 శాతం మేర సిగరెట్ ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు ఇప్పటికే తమ తమ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడంతో ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు మరోమారు ధరలను పెంచనున్నారు. ప్రస్తుతం గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం ధర ప్యాక్‌కు రూ.115 ఉండగా, మే నెలలో అది రూ.135 కానుందని సమాచారం. అలాగే రెండు కంపెనీలకు చెందిన పలు సెగ్మెంట్‌లలోని సిగరెట్ల ధరలు కూడా సమానంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమ్మకాల పరిమాణంపై ప్రభావం..
ఏప్రిల్ నెలలో సిగరెట్ల అమ్మకాలు మందగించిన నేపథ్యంలో ఆయా కంపెనీలు ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం పెంచిన తరువాత ఇప్పటికే అన్ని సెగ్మెంట్లలోనూ సిగరెట్ల ధరలు పెరిగాయి. దీని వల్ల అమ్మకాల పరిమాణంపై ప్రభావం పడింది. మహారాష్ట్రలో నిర్వహించిన డీలర్స్ చెక్ ప్రకారం ఏప్రిల్‌లో మొత్తం సిగరెట్ వాల్యూమ్స్ సుమారు 20 శాతం మేర పతనమవ్వగా, ప్రీమియం కింగ్ సైజ్ సెగ్మెంట్‌లో అత్యధిక తగ్గుదల నమోదైంది. ఫిబ్రవరి 1, 2026 నుంచి కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 30 నుంచి 40 శాతం వరకు పెంచింది. అందుకు అనుగుణంగా తయారీదారులు అన్ని సెగ్మెంట్లలోనూ ధరలను పెంచారు. ప్రీమియం ఉత్పత్తులపై పెరుగుదల అధికంగా ఉండగా, దాని వల్ల అమ్మకాలు తగ్గాయి.
స్మోకర్ల సంఖ్య తగ్గలేదు..
కింగ్ సైజ్ సెగ్మెంట్‌లో ఒక్క సిగరెట్ ధర రూ.20 నుంచి రూ.25-రూ.28 మధ్యకు పెరిగింది. కొందరు వినియోగదారులు తక్కువ ధర కలిగిన బ్రాండ్లకు మారారు. అయితే మొత్తం స్మోకర్ బేస్‌లో పెద్ద మార్పు లేదని డీలర్లు తెలిపారు. కింగ్ సైజ్ సెగ్మెంట్‌లో ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన క్లాసిక్, గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మార్ల్‌బోరో తదితర బ్రాండ్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లోనే అమ్మకాల పరిమాణం అధికంగా తగ్గింది. అయితే ఈ సెగ్మెంట్ రెండు కంపెనీలకు 30 శాతం కన్నా అధిక ఆదాయన్ని అందిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే డిమాండ్ తగ్గడంతో కంపెనీల ఆదాయాలపై ఇది గణనీయమైన ప్రభావం చూపనుంది. అందులో భాగంగానే ధరల పెంపు చోటు చేసుకుందని భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Lungs Cancer | ధూమపానం అలవాటే లేదు.. అయినా మహిళల్లో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు..!
మే 16, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



