త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Retirement Fund | 20 ఏళ్ల‌లో రూ.2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్‌ను జ‌మ చేయ‌లేమా..? సాధ్య‌మేనా..?

Retirement Fund | ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక చాలా మంది ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లు లేకుండా, ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌కుండా స్వ‌తంత్రంగా జీవించాల‌ని కోరుకుంటారు. అందుకు గాను ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలోనే రిటైర్మెంట్ ప్లాన్ల గురించి ఆలోచిస్తుంటారు. అయితే మారుతున్న జీవ‌న‌శైలితోపాటు పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా రిటైర్మెంట్ అనంత‌రం పొందే భ‌విష్య‌త్ నిధిపై చాలా మందికి స‌రైన అవ‌గాహ‌న ఉండ‌డం లేదు.

S

Business | Published On May 9, 2026, 11.04 am IST

Retirement Fund | 20 ఏళ్ల‌లో రూ.2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్‌ను జ‌మ చేయ‌లేమా..? సాధ్య‌మేనా..?
Advertisement

Retirement Fund | ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక చాలా మంది ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లు లేకుండా, ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌కుండా స్వ‌తంత్రంగా జీవించాల‌ని కోరుకుంటారు. అందుకు గాను ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలోనే రిటైర్మెంట్ ప్లాన్ల గురించి ఆలోచిస్తుంటారు. అయితే మారుతున్న జీవ‌న‌శైలితోపాటు పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా రిటైర్మెంట్ అనంత‌రం పొందే భ‌విష్య‌త్ నిధిపై చాలా మందికి స‌రైన అవ‌గాహ‌న ఉండ‌డం లేదు. ఎందుకంటే రిటైర్ అయ్యే వ‌ర‌కు రూ.2 కోట్ల‌ను కార్ప‌స్‌గా కూడ‌బెట్టాల‌ని అనుకుంటారు. కానీ జీవ‌న‌శైలి, ద్ర‌వ్యోల్బ‌ణం వంటి విష‌యాల‌ను మ‌రిచిపోతారు. అలాగే మార్కెట్ రిస్క్‌ను కూడా ప‌ట్టించుకోరు. దీంతో రిటైర్మెంట్ వ‌ర‌కు అనుకున్న కార్ప‌స్‌ను కూడ‌బెట్ట‌లేరు. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే అనుకున్న మొత్తాన్ని కూడ‌బెట్ట‌డం సాధ్య‌మేన‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ద్ర‌వ్యోల్బ‌ణాన్ని కూడా లెక్కించాలి..

సాధార‌ణంగా రిటైర్ అయ్యాక చాలా మందికి రూ.2 కోట్ల కార్ప‌స్ ఫండ్ స‌రిపోతుంది. కానీ కార్ప‌స్‌ను కూడ‌బెట్టే స‌మ‌యంలో ద్ర‌వ్యోల్బ‌ణం, జీవ‌న‌శైలి, మార్కెట్ రిస్క్‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కార్సస్ రూ.1.50 కోట్ల వ‌ద్దే ఆగిపోతుంది. లేదా అంత‌క‌న్నా త‌క్కువ జ‌మ కావ‌చ్చు. అందుక‌ని ప్ర‌తి ఏటా ద్ర‌వ్యోల్బ‌ణాన్ని కూడా లెక్కించి దానికి రెట్టింపు మొత్తంలో పెట్టుబ‌డి పెంచుతూ వెళ్లాలి. ఆర్థిక నిపుణులు తెలిపిన ప్ర‌కారం ప్ర‌తి ఏటా ద్ర‌వ్యోల్బ‌ణం 5 శాతం అనుకుంటే పెట్టుబ‌డి మొత్తాన్ని 10 శాతం పెంచాలి. అంటే నెల‌వారి పెట్టుబ‌డి మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిప్‌ల‌లో పెట్టే వారు ప్ర‌తి ఏడాది ఆ మొత్తాన్ని 10 శాతం పెంచుతూ వెళ్లాల‌న్న‌మాట‌. దీన్నే స్టెప్ అప్ సిప్ అంటారు. ఇది ద్ర‌వ్యోల్బ‌ణ భ‌యాన్ని త‌గ్గిస్తుంది. రిటైర్ అయ్యాక వ‌చ్చే కార్ప‌స్ పై ప్ర‌భావం ప‌డ‌కుండా చేస్తుంది.

జీవ‌న‌శైలి, అత్య‌వ‌స‌ర ఖ‌ర్చులు..

మారుతున్న జీవ‌న‌శైలి కార‌ణంగా చాలా మందికి చిన్న వ‌య‌స్సులోనే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల భారీ మొత్తంలో కార్ప‌స్‌ను కూడ‌బెట్టాల‌ని అనుకుంటే ఈ విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అక‌స్మాత్తుగా వ‌చ్చే అత్య‌వ‌స‌ర వైద్య ఖర్చుల‌ను భ‌రించేందుకు నెల నెలా ఎంతో కొంత పొదుపు చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నా అవి కొంత మేర వ‌రకు మాత్ర‌మే కుష‌న్ ఇస్తాయి. అందువ‌ల్ల అత్య‌వ‌స‌ర వైద్య ఖ‌ర్చుల‌కు నిధిని ముందు నుంచే జ‌మ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను పెట్టుబడి మొత్తంలో 10 శాతాన్ని డిజిట‌ల్ గోల్డ్‌, సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ వంటి వాటిల్లో పెట్టాలి. దీని వ‌ల్ల హెల్త్ ఇన్సూరెన్స్‌కు తోడుగా వైద్య ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధి జ‌మ అవుతుంది. ఇది మొత్తం కార్ప‌స్ రాబ‌డిపై ప్ర‌భావం చూపించ‌కుండా ఉంటుంది.

మార్కెట్లు ప‌త‌న‌మైనా కూడా..

చాలా మంది మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టినా రిటైర్మెంట్ చివ‌రి ద‌శ‌లో మార్కెట్లు ప‌త‌న‌మైతే కార్ప‌స్ మొత్తం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. అందువ‌ల్ల ఇలాంటి రిస్క్ రావొద్ద‌నుకుంటే మొత్తంలో పెట్టుబ‌డిలో 60 నుంచి 70 శాతం వ‌ర‌కు మాత్ర‌మే మ్యుచువ‌ల్ ఫండ్స్ లేదా షేర్ల‌లో ఉండాలి. 10 శాతం అత్య‌వ‌స‌ర నిధి, 60 శాతం వ‌ర‌కు ఈక్విటీ పొదుపు పోను మిగిలిన 30 శాతాన్ని పీపీఎఫ్ లేదా బాండ్లు, డెట్ ఫండ్ల‌లో ఉంచాలి. దీని వ‌ల్ల మార్కెట్లు ప‌త‌న‌మైన‌ప్పుడు కూడా పెట్టుబ‌డుల‌కు ఢోకా ఉండ‌దు. ఇలా పెట్టుబ‌డిదారులు త‌మ పొదుపును భిన్న మార్గాల్లో విభ‌జించి పెట్టుబ‌డులు పెడితే రిటైర్మెంట్ వ‌ర‌కు అనుకున్న కార్ప‌స్ మొత్తం జ‌మ అవుతుంది.

నెల‌కు ఎంత పొదుపు చేయాలి..

సాధార‌ణంగా 5 శాతం ద్ర‌వ్యోల్బ‌ణం, ఇత‌ర అంశాల‌ను పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఇప్పుడు ఉన్న రూ.2 కోట్లు భ‌విష్య‌త్తులో రూ.1.70 కోట్లే అవుతాయి. అందువ‌ల్ల నిధి రెట్టింపు అయ్యే మార్గం చూడాలి. అంటే 20 ఏళ్ల‌లో రూ.2 కోట్లు క‌నీసం రూ.5 కోట్లుగా మారాలి. అప్పుడే అన్ని ఖ‌ర్చుల‌కు స‌రైన మొత్తం జ‌మ అవుతుంది. ఇక 20 ఏళ్ల‌లో రూ.5 కోట్లు ఉండాలంటే నెల‌కు కచ్చితంగా రూ.20 వేల నుంచి రూ.22 వేల వ‌ర‌కు పొదుపు చేయాలి. వార్షిక రాబ‌డి 12 శాతం అనుకుంటే, పైన తెలిపిన విధంగా ఈ మొత్తాన్ని పెట్టుబ‌డి పెడితే నిర్దిష్ట స‌మ‌యంలో లేదా రిటైర్మెంట్ వ‌ర‌కు అనుకున్న మొత్తం కార్ప‌స్ స‌మ‌కూరుతుంది. అయితే పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement