Banks Strike | ప్రభుత్వ బ్యాంకుల సమ్మె.. రేపు సేవలకు అంతరాయం..!
Banks Strike | దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు మంగళవారం నిలిచిపోయే అవకాశం ఉన్నది. ఐదురోజుల వారపు పనిదినాల డిమాండ్‌పై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (UFBU) జనవరి 27న సమ్మెకు పిలుపునిచ్చింది.
Banks Strike | దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు మంగళవారం నిలిచిపోయే అవకాశం ఉన్నది. ఐదురోజుల వారపు పనిదినాల డిమాండ్‌పై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు (UFBU) జనవరి 27న సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో సానుకూలంగా లేకపోవడంతో అధికారులు, ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న తొమ్మిది యూనియన్లతో కూడిన యూఎఫ్‌బీయూ సమ్మెకు చేయాలని నిర్ణయించింది. జనవరి 26న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బ్యాంకులు మూతపడ్డాయి. తాజాగా సమ్మె కారణంగా మంగళవారం వరుసగా మూడోరోజు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనున్నది. చర్చలు వివరణాత్మకంగా జరిగినప్పటికీ.. డిమాండ్‌పై ఎలాంటి హామీ లేదన్నారు.
దాంతో తాము సమ్మెను కొనసాగించాల్సి వచ్చిందని యూఎఫ్‌బీయూ సభ్యుడు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ మాట్లాడుతూ అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలనే నిర్ణయం మార్చి 2024లో వేతన సవరణ ఒప్పందం సమయంలో నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం డిమాండ్‌కు స్పందించకపోవడం దురదృష్టకరమని, సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాలు అదనంగా పని చేయడానికి తాము అంగీకరించామన్నారు.
యూఎఫ్‌బీయూలోని మరో సభ్యుడు నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE) జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ ఉద్యమం కస్టమర్లకు వ్యతిరేకంగా కాదని.. సమర్థవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ కోసం మాత్రమేనన్నారు. సరైన విశ్రాంతి ఉంటేనే బ్యాంకర్ దేశానికి మెరుగ్గా సేవలందిస్తాడని.. సమతుల్య శ్రామిక శక్తి ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఐదురోజుల బ్యాంకింగ్ విలాసం కాదని.. ఆర్థిక, మానవ అవసరమని తెలిపారు. ఇదిలా ఉండగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSBs)ల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్ క్లియరెన్స్‌లు, పరిపాలన తదితర సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు సమ్మెలో భాగం కాకపోవడంతో కార్యకలాపాలు యథావిధిగా నడిచే అవకాశం ఉంది. అయితే, సమ్మెతో బ్యాంకుల కార్యకలాపాలు ప్రభావితమైనా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో సహా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగనున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో 2024 మార్చి ఒప్పందం సమయంలో అంగీకరించిన మేరకు శనివారం సెలవుదినం ఇవ్వాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ప్రతి నెలా మొదటి, మూడో, ఐదో శనివారాలు బ్యాంకులు తెరిచే ఉంటున్నాయి.
తాజావార్తలు
- ●MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల
- ●Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్
- ●Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి
- ●రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!
- ●Konda Surekha Resignation | రాజీనామా చేయండి.. సురేఖకు హైకమాండ్ ఆదేశం
- ●Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో

MP Eatala Rajender | హానర్ హోమ్స్ జాగా..వెనక్కి తీసుకోగలరా సీఎం గారూ? : ఎంపీ ఈటల

Alia Bhatt | అడల్ట్ కామెడీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా అలియాభట్ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్

Accident | ఒకే కుటంబంలో పెను విషాదం.. గంటల వ్యవధిలో నలుగురి మృతి

రేవంత్ ‘యూఎస్ టూర్’ బ్రేక్: వివాదాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చిన తెలంగాణ సీఎం!






