Health Insuarance | ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
Health Insuarance | రవి ఓ ప్రైవేటు సంస్థలో చిన్న ఉద్యోగి. జీతం తక్కువే అయినా ఆరోగ్యం, ఆస్పత్రుల విషయంలో స్పృహ ఎక్కువే. అందుకే ఆఫీసులో లేకపోయినా సరే బయట ప్రైవేటుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇక తనకు ఏ ఇబ్బంది లేదని అనుకున్నాడు. ఇలా ఉండగా అతని భార్య డెలివరీ అయ్యింది.
Health Insuarance | రవి ఓ ప్రైవేటు సంస్థలో చిన్న ఉద్యోగి. జీతం తక్కువే అయినా ఆరోగ్యం, ఆస్పత్రుల విషయంలో స్పృహ ఎక్కువే. అందుకే ఆఫీసులో లేకపోయినా సరే బయట ప్రైవేటుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇక తనకు ఏ ఇబ్బంది లేదని అనుకున్నాడు. ఇలా ఉండగా అతని భార్య డెలివరీ అయ్యింది. పండంటి బాబు పుట్టాడని సంబురపడ్డాడు. కానీ పుట్టిన బాబు ఆరోగ్యం బాగోలేదు. వారం రోజులు ఐసీయూలో ఉంచారు. ఇన్సూరెన్స్ ఉంది కదా చేతిలో నుంచి ఒక్క రూపాయి పెట్టకుండా బాబుకు ట్రీట్‌మెంట్ చేయించవచ్చని అనుకున్నాడు. తీరా చూస్తే సదరు ఇన్సూరెన్స్ కంపెనీ క్లైయిమ్ రిజెక్ట్ చేసింది. మా పాలసీ ప్రకారం.. భార్య డెలివరీకే డబ్బులు వస్తాయి.. కానీ పుట్టిన బిడ్డ అనారోగ్య సమస్యలకు క్లైయిమ్ ఇవ్వలేమని చెప్పాయి. దీంతో చేసేదేమీ లేక బయట అప్పు చేసి మరీ ఆస్పత్రి బిల్లు కట్టాల్సి వచ్చింది.
ఈ సమస్య రవి ఒక్కడిదే కాదు.. మనలో చాలామందికి ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు పాలసీ కండీషన్లను పూర్తిగా తెలుసుకోవడం లేదు. దీనివల్ల క్లైయిమ్ సమయానికి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి రావద్దంటే.. ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు కొన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చేసే కొన్ని తప్పులను వివరిస్తున్నారు.
తక్కువకు వస్తుందని ఆశపడొద్దు
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు రెండు మూడు పాలసీలను కంపేర్ చేస్తుంటారు. ఆ సమయంలో ఒకే అమౌంట్‌కు ఏ కంపెనీ తక్కువ ప్రీమియం ఆఫర్ చేస్తుందనే విషయాన్ని గమనిస్తారు. కానీ అవి ఏయే వ్యాధులకు వర్తిస్తాయి, ఒకవేళ వర్తిస్తే వాటి ట్రీట్‌మెంటులో ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పే చేస్తుంది? మనం ఎంత పే చేయాలి? రూం రెంట్ ఎంత అమౌంట్ వరకు ఇస్తుంది వంటి ఇతరత్రా వివరాలను గమనించరు. దీంతో క్లైయిమ్ టైమ్‌లో ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు Terms & Conditions ను జాగ్రత్తగా చదవాలి.
క్లైయిమ్ సెటిల్‌మెంట్ రేటు
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి కదా అని గుడ్డిగా వెళ్లొద్దు. మనం పాలసీ తీసుకునే కంపెనీ ఏ విధంగా సెటిల్‌మెంట్లు చేస్తుందనే ఇస్టరీని తెలుసుకోవాలి. క్లైయిమ్ అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత సెటిల్ చేస్తుంది? మొత్తం బిల్లులో ఎంత శాతం తగ్గిస్తుంది? సరైన సమయానికి క్లైయిమ్ సెటిల్ చేస్తుందా? లేదా ఆలస్యం చేస్తుందా వంటి వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
వెయిటింగ్ పీరియడ్‌పైనా దృష్టి పెట్టాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు క్లైయిమ్ వస్తుందని అనుకోవద్దు. కొన్ని పరిస్థితుల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు ముందు నుంచే ఉన్న వ్యాధుల ( Pre Existing Diseases )కు రెండు నుంచి నాలుగు సంవత్సరాల వెయింట్ ఉంటుంది. మెటర్నిటీకి సంబంధించి కూడా వెయింట్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకునే ముందే వెయిటింగ్ పీరియడ్ గురించి తెలుసుకుంటే సమయానికి తప్పులు జరగకుండా చూసుకోవచ్చు.
పాలసీ కవరేజి ఎంత ఉండాలి?
పాలసీ తీసుకునేప్పుడు తక్కువ ప్రీమియంలో అయిపోవాలని కాకుండా.. మనకు ఎంత అమౌంట్‌కు ఇన్సూరెన్స్ అవసరమనేది ఆలోచించుకోవాలి. మన ఇంట్లో ఎంత మంది ఉన్నారు? వాళ్లకు ఎంత వరకు ఇన్సూరెన్స్ అవసరమనేది ముందే అంచనా వేసుకోవాలి. కానీ కొంతమంది అవన్నీ ఆలోచించకుండా ప్రీమియం తక్కువ పడుతుందని.. తక్కువ అమౌంట్‌కే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. తీరా ఇన్సూరెన్స్ అవసరమొచ్చే సమయానికి అమౌంట్ సరిపోక.. టాప్ అప్ పాలసీ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే అన్నింటి గురించి ఆలోచించుకుని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి.
మీ ఏరియాలో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఉందా?
ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వర్క్ కంపెనీల్లో మాత్రమే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఆ కంపెనీ నెట్‌వర్క్ కింద ఎలాంటి ఆస్పత్రులు ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఉండే ఏరియాకు సమీపంలో అలాగే మంచి ఆస్పత్రులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడే మనం చేతి నుంచి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా ట్రీట్‌మెంట్ పొందవచ్చు. లేదంటే ముందు డబ్బులు చెల్లించి క్లైయిమ్ కోసం ఆస్పత్రి, ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగాల్సి వస్తుంది.
ప్రాథమిక ఆరోగ్యం మాత్రమే కాదు..!
పాలసీ తీసుకునేప్పుడు తక్కువకు వస్తుందా అనేది కాకుండా ఏయే ప్రయోజనాలు ఉన్నాయనేది తెలుసుకోవాలి. ఎందుకంటే తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ ఇస్తున్నారంటే అందులో ఏదో ఒకటి తక్కువగా ఉండొచ్చు. కాబట్టి పాలసీ తీసుకునే ముందు ఏయే వ్యాధులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందనేది తెలుసుకోవాలి. కేవలం ప్రాథమిక ఆరోగ్యం మాత్రమే కాకుండా క్రిటికల్ ఇల్‌నెస్, యాక్సిడెంటల్ కవర్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. క్లైయిమ్ తక్కువగా రాకుండా ఉండాలంటే పాలసీ తీసుకునే ముందు రివ్యూలు, రేటింగ్‌లు చూడాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను క్షుణ్నంగా చదువుకోవాలి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






