Apple | పాకిస్థాన్‌లో ఐఫోన్లను తయారు చేయనున్న యాపిల్..?
Apple | అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ పాకిస్థాన్‌లో ఐఫోన్‌ల తయారీకి అడుగులు వేస్తోంది. ఇందుకు పాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్ లో యాపిల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అంగీకరించిందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
Apple | అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ పాకిస్థాన్‌లో ఐఫోన్‌ల తయారీకి అడుగులు వేస్తోంది. ఇందుకు పాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్ లో యాపిల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అంగీకరించిందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ విధానం కింద పాకిస్థాన్‌లో ఐఫోన్లను తయారు చేయడంతోపాటు రీఫర్బిష్డ్ ఐఫోన్‌లను మరమ్మత్తు చేసి తిరిగి ఎగుమతి చేయడానికి యాపిల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తొలి ఏడాదిలోనే రీఫర్బిష్డ్ ఐఫోన్‌ల ఎగుమతుల ద్వారా 100 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశముందని పాక్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పాక్‌కు యాపిల్ కంపెనీ షరతులు..
ఈ సందర్భంగా యాపిల్ యాజమాన్యం కొన్ని కీలక షరతులను పాక్ ప్రభుత్వానికి తెలియజేసిందని పాక్ ఇంజినీరింగ్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో హమద్ అలీ మంసూర్ తెలిపారు. తక్కువ ధరకు భూమి కేటాయింపు, 8 శాతం పనితీరు ప్రోత్సాహకం, రెండు నుంచి మూడు సంవత్సరాల పాత ఐఫోన్‌ల రిపేర్ యూనిట్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోదానికి పంపినట్లు ఆయన తెలిపారు. కాగా యాపిల్ గతంలో ఇండోనేసియా, మలేషియా, భారత్‌లలో ఇదే విధానాన్ని అమలు చేసిందని మంసూర్ తెలిపారు. తొలుత రిపేర్ యూనిట్లతో స్థానిక మానవ వనరులకు శిక్షణ ఇచ్చి, అనంతరం పూర్తి స్థాయి తయారీకి యాపిల్ వెళ్లిందని గుర్తు చేశారు.
చైనా కంపెనీల ద్వారా కూడా పెట్టుబడులు..
ప్రస్తుతం పాకిస్థాన్‌లో మొబైల్ తయారీదారులకు ప్రభుత్వం 6 శాతం ప్రోత్సాహకం ఇస్తుండగా, యాపిల్‌ను ఆకర్షించేందుకు దానిని 8 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా చైనా కంపెనీల నుంచి కూడా 557 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని పాక్ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటన సందర్భంగా ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ తయారీలో కేవలం 12 శాతం లోకలైజేషన్ మాత్రమే ఉందని, తొలి ఏడాదిలోనే దాన్ని 35 శాతానికి, తరువాత 50 శాతానికి పెంచేందుకు కంపెనీలు హామీ ఇచ్చాయని మంసూర్ చెప్పారు. భవిష్యత్తులో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, వాచ్‌లు, ట్రాకర్లు, ఇయర్‌బడ్స్ తయారీకి కూడా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

Apple | యాపిల్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు.. స్లీప్ అప్నియాను గుర్తించడం ఇక ఈజీ, వినికిడి పరీక్షను స్వయంగా చేసుకోవచ్చు..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



