త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon | ఆసియాలోనే రెండో అతిపెద్ద క్యాంప‌స్‌..! బెంగ‌ళూరులో ప్రారంభించిన అమెజాన్‌..!

Amazon | ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో త‌న కార్యకలాపాలను మరింత విస్తరించింది. బెంగ‌ళూరులో ఆసియాలో రెండో అతిపెద్ద కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది. దాదాపు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 12 అంతస్తుల్లో నిర్మించిన ఈ కొత్త క్యాంపస్ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఈ-కామర్స్, ఆపరేషన్స్, పేమెంట్స్, టెక్నాలజీ, సెల్లర్ సర్వీసెస్ విభాగాలకు చెందిన 7వేల‌మందికి పైగా ఉద్యోగులకు సేవ‌లందించ‌నున్న‌ది.

P

Business | Published On Feb 23, 2026, 8.30 pm IST

Amazon | ఆసియాలోనే రెండో అతిపెద్ద క్యాంప‌స్‌..! బెంగ‌ళూరులో ప్రారంభించిన అమెజాన్‌..!
Advertisement

Amazon | ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో త‌న కార్యకలాపాలను మరింత విస్తరించింది. బెంగ‌ళూరులో ఆసియాలో రెండో అతిపెద్ద కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించింది. దాదాపు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 12 అంతస్తుల్లో నిర్మించిన ఈ కొత్త క్యాంపస్ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఈ-కామర్స్, ఆపరేషన్స్, పేమెంట్స్, టెక్నాలజీ, సెల్లర్ సర్వీసెస్ విభాగాలకు చెందిన 7వేల‌మందికి పైగా ఉద్యోగులకు సేవ‌లందించ‌నున్న‌ది. ఈ భవనాన్ని క‌ర్నాట‌క భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ సోమ‌వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ను ప్రపంచ టెక్నాలజీ, ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టడంలో అమెజాన్ వంటి సంస్థల పెట్టుబడులు కీలకమన్నారు.

ఇలాంటి పెద్ద క్యాంపస్‌లతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇవి తోడ్పడతాయని, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటికే 40 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టిన అమెజాన్, 2030 నాటికి మరిన్ని 35 బిలియన్ డాలర్ల‌కు పెంచేందుకు క‌ట్టుబ‌డి ఉంది. ఈ ప్ర‌ణాళిక‌లో భాగంగానే బెంగళూరులో ఈ ఆధునిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప‌స్‌ని ప్రారంభించింది. ఉద్యోగులు సులభంగా కలిసి పనిచేసేలా, ఆలోచనలు పంచుకునేలా, కొత్త విష‌యాల‌ను నేర్చుకునేలా క్యాంప్‌కు రూపకల్పన చేశామని కంపెనీ తెలిపింది.

బెంగళూరు చాలా కాలంగా తమ టెక్నాలజీ, బిజెనెస్ టీమ్స్‌కు ప్రధాన కేంద్రంగా ఉందని, ప్రతిభకు ఈ నగరం ముఖ్యమైన వేదికగా కొనసాగుతోందని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ పేర్కొన్నారు. ఈ క్యాంపస్‌లో ఆధునిక వర్క్‌స్పేస్‌లు, సౌకర్యవంతమైన మీటింగ్ హాల్స్‌, 200 మందికిపైగా కూర్చునే సామర్థ్యంతో ఈవెంట్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాస్కెట్‌బాల్, పికిల్‌బాల్ మైదానాలు, యాంఫి థియేటర్, గార్డెన్స్ వంటి స‌దుపాయాలు క‌ల్పించింది. రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కేఫెటేరియాల్లో దేశీయ, విదేశీ వంటకాలు అందుబాటులో ఉంటాయి. పర్యావరణానికి హాని తక్కువగా ఉండే నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం, వనరులను పునర్వినియోగించడం వంటి త‌దిత‌ర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

Advertisement
Advertisement