త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amazon Great Summer Sale| అమెజాన్ గ్రేట్ స‌మ్మర్ సేల్‌లో భారీ డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్న టాప్ ఫోన్లు.. వివ‌రాలు ఇవే..

Amazon Great Summer Sale| అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 మే 8వ తేదీనే ప్రారంభం కాగా, శామ్‌సంగ్ గెలాక్సీ ఆధ్వర్యంలో ఈ భారీ సేల్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్స్, యాక్సెసరీస్‌పై గరిష్టంగా 40 శాతం వరకు తగ్గింపు ధ‌ర‌లు పొంద‌వ‌చ్చు.

S

Business | Published On May 9, 2026, 1.49 pm IST

Amazon Great Summer Sale| అమెజాన్ గ్రేట్ స‌మ్మర్ సేల్‌లో భారీ డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్న టాప్ ఫోన్లు.. వివ‌రాలు ఇవే..
Advertisement

Amazon Great Summer Sale| అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 మే 8వ తేదీనే ప్రారంభం కాగా, శామ్‌సంగ్ గెలాక్సీ ఆధ్వర్యంలో ఈ భారీ సేల్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్స్, యాక్సెసరీస్‌పై గరిష్టంగా 40 శాతం వరకు తగ్గింపు ధ‌ర‌లు పొంద‌వ‌చ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ల ద్వారా రూ.66వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయని అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో శామ్‌సంగ్ ఫోన్లపై అత్యధిక రాయితీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా 5జి (12జీబీ, 256జీబీ) ని రూ.94,999కి అందిస్తున్నారు. గెలాక్సీ ఎం17 5జి ఫోన్‌ను రూ.13,999కి, గెలాక్సీ ఎం56 5జి ఫోన్‌ను రూ.29,999కి పొంద‌వ‌చ్చు. అలాగే గెలాక్సీ ఎం17ఇ, ఎం36 5జి, గెలాక్సీ జ‌డ్ ఫోల్డ్‌7 5జి, గెలాక్సీ ఎస్‌26 ప్ల‌స్ 5జి, గెలాక్సీ ఎం07 తదిత‌ర ఫోన్ల‌ను ఈ సేల్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఇస్తున్నారు.

వ‌న్‌ప్ల‌స్‌, ఐక్యూ..

వన్‌ప్లస్ ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధ‌ర‌లు అందుబాటులో ఉన్నాయి. వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ6 ఫోన్‌ను రూ.27,999కు కొన‌వ‌చ్చు. నార్డ్ 6 ధ‌ర‌ను రూ.36,999గా నిర్ణ‌యించారు. వ‌న్‌ప్ల‌స్ 13 (16జీబీ, 512జీబీ) రూ.69,998కి ల‌భిస్తుండ‌గా, వ‌న్‌ప్ల‌స్ 13ఆర్ ఫోన్ రూ.37,999, వ‌న్‌ప్ల‌స్ 13ఎస్ రూ.46,999, వ‌న్‌ప్ల‌స్ 15 రూ.73,999, వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ రూ.50,999కి ల‌భిస్తున్నాయి. ఐక్యూ బ్రాండ్‌కు చెందిన ఐక్యూ నియో 10 ఫోన్ త‌గ్గింపు అనంతరం రూ.34,999కి అందుబాటులో ఉంది. అలాగే ఐక్యూ 15ఆర్ రూ.42,999, ఐక్యూ జ‌డ్‌10 రూ.23,499, ఐక్యూ జ‌డ్‌11ఎక్స్‌, ఐక్యూ జ‌డ్‌10ఆర్ రూ.20,999కు ల‌భిస్తున్నాయి. ఐక్యూ జ‌డ్‌10 లైట్ 5జి రూ.13,499, ఐక్యూ 15 రూ.66,999కి అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మీ, ఒప్పో, వివో, రియ‌ల్‌మి, లావా..

రెడ్‌మీ సిరీస్‌లో రెడ్‌మీ ఎ7 ప్రొ 5జి, రెడ్‌మీ నోట్ 15 5జి, రెడ్‌మీ నోట్ 15 ప్రొ 5జి, రెడ్‌మీ నోట్ 15 ప్రొ ప్ల‌స్ 5జి, నోట్ 14 ప్రొ ప్ల‌స్ ప్రైమ్ ఎడిష‌న్‌, రెడ్‌మి 15సి వంటి ఫోన్లు త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్నాయి. అలాగే ఒప్పోలో రెనో 15 ప్రొ 5జి, రెనో 15 5జిల‌తోపాటు వివోలో వి70 5జి, వి70 ఎఫ్ఈ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఇస్తున్నారు. టెక్నో పాప్ ఎక్స్ 5జి, రియ‌ల్‌మి నార్జో 100 లైట్ 5జి, నార్జో ప‌వ‌ర్ 5జి, నార్జో 80 ప్రొ 5జి, నార్జో 90ఎక్స్ 5జి ఫోన్లు, లావాలో అగ్ని 4, అగ్ని 3, బోల్డ్ ఎన్‌2, బోల్డ్ ఎన్‌1 5జి, బోల్డ్ 2 5జి, బ్లేజ్ డ్యుయో, ప్లే అల్ట్రా ఫోన్ల‌ను డిస్కౌంట్ ధ‌ర‌ల‌కు పొంద‌వ‌చ్చు.

బ్యాంకు ఆఫ‌ర్లు, నో-కాస్ట్ ఎంఈఐ..

ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌ ఈఎంఐ లావాదేవీలపై గరిష్టంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఎంపిక చేసిన కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ప్రైమ్ సభ్యులకు అదనంగా 3 శాతం వరకు తగ్గింపు, రూ.2,500 ఖర్చుపై రూ.250 క్యాష్‌బ్యాక్ లభిస్తుందని అమెజాన్‌ తెలిపింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, ఫ్లైట్ బుకింగ్స్‌పై అదనంగా 5 శాతం తగ్గింపు, రూ.2,500 వరకు ప్రైమ్ వెల్కమ్ రివార్డ్స్ అందిస్తున్నారు. అమెజాన్ పే లేట‌ర్ ద్వారా రూ.60వేల‌ వరకు క్రెడిట్, రూ.600 వరకు రివార్డ్స్, 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement