Airtel | ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు… ఇక 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త ఆఫర్స్..
Airtel | ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రీచార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు 28 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్లకు బదులుగా.. ఇకపై పూర్తి 30 రోజుల గడువుతో కొత్త ప్లాన్లను అందిస్తోంది.
Airtel | ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రీచార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు 28 రోజుల వాలిడిటీ ఉన్న ప్లాన్లకు బదులుగా.. ఇకపై పూర్తి 30 రోజుల గడువుతో కొత్త ప్లాన్లను అందిస్తోంది. దీంతో ప్రతి నెలా మళ్లీ మళ్లీ రీచార్జ్ చేసుకునే ఇబ్బందులు తగ్గడంతో పాటు, వార్షికంగా వినియోగదారుల ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు తీసుకువచ్చినట్లుగా ఎయిర్‌టెల్ పేర్కొంది.
రూ.379 ప్లాన్
రూ.379 ప్లాన్ వినియోగదారులకు పలు ప్రయోజనాలను అందిస్తోంది. రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదనంగా అడోబ్ ప్రీమియం, ఎయిర్‌టెల్ మ్యూజిక్, హలో ట్యూన్స్, 30 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్స్ అందివ్వనుంది.
రూ.429 ప్లాన్..
ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నవారికి రూ.429 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ప్రత్యేకత.
రూ.589, రూ.605 ప్లాన్స్
ఎక్కువ డేటా వినియోగించే వినియోగదారుల కోసం రూ.589, రూ.605 ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. రూ.589 ప్లాన్‌లో 50 జీబీ డేటా, రూ.605 ప్లాన్‌లో 60 జీబీ డేటా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లకు 30 రోజుల వాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు అందిస్తారు. వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఈ ప్లాన్స్ అనుకూలంగా ఉంటాయి.
రూ.279 ప్లాన్
ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడే వినియోగదారుల కోసం రూ.279 ప్లాన్ ప్రత్యేకంగా తీసుకువచ్చింది. ఇందులో కేవలం వన్ జీబీ డేటా మాత్రమే ఉన్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే వంటి ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ లభిస్తుంది.
డేటా వోచర్లు, ఓటీటీ ప్లాన్లలో కూడా మార్పులు..
- డేటా వోచర్లు, ఓటీటీ బెనిఫిట్స్ ప్లాన్ల వాలిడిటీని కూడా ఎయిర్‌టెల్ 30 రోజులకు పెంచింది.
- రూ.48 ప్లాన్‌లో వన్ జీబీ డేటాతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
- రూ.100 ప్లాన్‌లో సిక్స్ జీబీ డేటాతో పాటు మొబైల్, టీవీ యాక్సెస్ ఉంటుంది.
- రూ.161 ప్లాన్‌లో 12 జీబీ డేటా, రూ.195 ప్లాన్‌లో 12 జీబీ డేటాతో పాటు జియోహాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే యాక్సెస్ లభిస్తుంది.
- రూ.361 ప్లాన్‌లో 50 జీబీ డేటాతో పాటు 3 నెలల ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






