త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air travel is expensive | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమాన ప్రయాణికుల జేబులపై ప్రభావం..!

Air travel is expensive | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం విమాన ప్రయాణికుల జేబులపై ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలు అయిన ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్ దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జ్ విధించాలని నిర్ణయించాయి.

P

Business | Published On Mar 15, 2026, 11.40 am IST

Air travel is expensive | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమాన ప్రయాణికుల జేబులపై ప్రభావం..!
Advertisement

Air travel is expensive | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం విమాన ప్రయాణికుల జేబులపై ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రధాన విమానయాన సంస్థలు అయిన ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్ దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఇంధన సర్‌చార్జ్ విధించాలని నిర్ణయించాయి. విమాన ఇంధనం (ATF) ధరలు వేగంగా పెరిగిన సమయంలో వాటి ప్రభావాన్ని తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు టికెట్‌పై అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఇంధన సర్‌చార్జిగా పిలుస్తారు. ఇది సాధారణ టికెట్‌ ధరకు అదనంగా వసూలు చేయనున్నాయి. సాధారణంగా ఒక విమానయాన సంస్థ మొత్తం వ్యయాల్లో దాదాపు 25శాతం ఇంధన ఖర్చే ఉంటుంది. దాంతో ఇంధన ధరలు పరిగినప్పుడు సర్‌చార్జి విధించడం సంస్థలకు అవసరంగా మారుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో సర్‌చార్జ్ ఎందుకు?

వెస్ట్‌ ఆసియాలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి విమానయాన సంస్థలు. ఆ ప్రాంతంలో ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల కారణంగా ముడి చమురు సరఫరాలు దెబ్బతిని, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో భద్రతా కారణాల వల్ల అనేక విమానయాన సంస్థలు వెస్ట్‌ ఆసియా గగనతలాన్ని దాటకుండా ప్రత్యామ్నాయ, పొడవైన మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. ఈ మార్గాలు ఎక్కువ దూరం కావడంతో ఇంధన వినియోగం పెరిగి, నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకునేందుకు ప్రధాన సంస్థలు వేర్వేరు రేట్లను నిర్ణయించాయి.

ఏ కంపెనీలు ఎంత పెంచాయంటే..

ఎయిర్‌ ఇండియా మార్చి 12 నుంచి దేశీయ విమానాలపై రూ.399 ఇంధన సర్‌చార్జ్ విధించింది. రెండో దశలో మార్చి 18 నుంచి యూరప్‌, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలకు వెళ్లే విమానాలపై 25 నుంచి 50 డాలర్ల వరకు సర్‌చార్జ్ పెంచనున్నట్లు ప్రకటించింది. ఇండిగో మార్చి 14 నుంచి దేశీయ, అంతర్జాతీయ టికెట్లపై రూ.425 నుంచి రూ.2,300 వరకు సర్‌చార్జ్ వెల్లడించింది. దేశీయ విమానాలకు రూ.425 కాగా, యూరప్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే విమానాలకు గరిష్ఠంగా రూ.2,300 వరకు వసూలు చేయనున్నది. ఆకాసా ఎయిర్‌లైన్‌ ఆదివారం నుంచి బుక్‌ చేసే టికెట్లపై విమాన ప్రయాణ దూరాన్ని బట్టి రూ.199 నుంచి రూ.1,300 వరకు సర్‌చార్జ్ విధించనున్నట్లు వెల్లడించింది.

గ్లోబల్ చమురు సరఫరాలపై ప్రభావం

వెస్ట్‌ ఆసియా ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాలపైనా ప్రభావం చూపుతున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడుల కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరిగే హోర్ముజ్ జలసంధిలో రవాణా దాదాపు నిలిచిపోయినట్లు సమాచారం. అయితే, భారతదేశానికి అవసరమైన ఎల్పీజీ సరఫరాలను తీసుకువస్తున్న ‘శివాలిక్’, ‘నందాదేవి’ అనే రెండు నౌకలు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు సమాచారం. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (IATA) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా విమాన టికెట్ల ధరలు సుమారు 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వెస్ట్‌ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గి, అంతర్జాతీయ చమురు ధరలు స్థిరపడే వరకు విమానయాన సంస్థల ఖర్చులు అధికంగానే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు తాత్కాలికంగా అదనపు ఖర్చులకు సిద్ధంగా ఉండాల్సి వస్తోంది.

Advertisement
Advertisement