Air India | ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్.. రూ.1499కే విమాన టిక్కెట్..
Air India | విమాన ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త. ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ మార్గాలపై ప్రత్యేక సేల్‌ను ప్రకటించడంతో విమాన టికెట్ ధరలు తగ్గాయి. నమస్తే వరల్డ్ పేరిట ప్రారంభమైన ఈ ఆఫర్‌లో ప్రాథమిక చార్జీలపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
Air India | విమాన ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త. ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ మార్గాలపై ప్రత్యేక సేల్‌ను ప్రకటించడంతో విమాన టికెట్ ధరలు తగ్గాయి. నమస్తే వరల్డ్ పేరిట ప్రారంభమైన ఈ ఆఫర్‌లో ప్రాథమిక చార్జీలపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు రాయితీలు, ఒకసారి ఉచితంగా ప్రయాణ తేదీ మార్పు సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన ప్రకారం, ఈ సేల్‌లో దేశీయ టికెట్లు రూ.1,499 నుంచి, అంతర్జాతీయ టికెట్లు రూ.5,033 నుంచి ప్రారంభమవుతాయి. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా వంటి కీలక గమ్యస్థానాలకు ఆకర్షణీయ ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే ఇవి సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటాయి.
బుకింగ్ గడువు, ప్రయాణ కాలం..
ఈ పరిమితకాల సేల్ ఫిబ్రవరి 5 వరకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసిన టికెట్లతో ఫిబ్రవరి 11 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రయాణించవచ్చు. సేల్ కాలంలో బుక్ చేసిన ప్రతి టికెట్‌కు ఏప్రిల్ 1 తర్వాతి ప్రయాణాలకు ఒకసారి ఉచితంగా తేదీ మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణానికి కనీసం72 గంటల ముందే తేదీ మార్పు కోరాలి. మార్పు ఫీజు ఉండదని, అయితే కొత్త తేదీకి సంబంధించిన టికెట్ ధర వ్యత్యాసాన్ని మాత్రం ప్రయాణికుడే భరించాలని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఎలా బుక్ చేయాలి?
ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అదనంగా, అనుమతి పొందిన ట్రావెల్ ఏజెంట్లు, విమానాశ్రయ టికెటింగ్ కార్యాలయాలు, కాంటాక్ట్ సెంటర్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. సీట్లు ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది. వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా బుక్ చేస్తే కన్వీనియెన్స్ ఫీజు లేకుండా టికెట్లు లభిస్తాయని ఎయిర్ ఇండియా తెలిపింది. నగరాన్ని బట్టి మారక రేట్లు, పన్నుల కారణంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది. ఇందులో 31 దేశాల్లో 43 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా గ్రూప్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్) కలిపి 300కు పైగా విమానాలతో 55 దేశీయ, 45 అంతర్జాతీయ మార్గాల్లో సేవలు అందిస్తోంది. ముంబై-ఢిల్లీ వంటి రద్దీ మార్గాల్లో అధిక సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. ఈ నమస్తే వరల్డ్ సేల్ ప్రయాణికులకు గణనీయమైన ఆదా కల్పించే అవకాశంగా కనిపిస్తోంది.
సంబంధిత వార్తలు

Noida Airport | నోయిడా నుంచి తొలి విమానం నవీ ముంబయికే..! ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్..!
మే 6, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026

Skyscanner In ChatGPT | తక్కువ టిక్కెట్ ధరతోనే విమానంలో వెళ్లాలా.. అయితే చాట్ జీపీటీని ఇలా అడగండి..
ఏప్రిల్ 24, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



