Stock Market | దలాల్ స్ట్రీట్‌లో రంకేసిన బుల్.. లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మార్కెట్‌లో సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ 2.50శాతానికిపైగా పెరిగాయి.
- యూఎస్ ట్రేడ్ డీల్‌తో ఉత్సాహం
- 2,072 పాయింట్ల ఎగువన ముగిసిన సెన్సెక్స్
- 639 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ఒకే రోజుపెరిగిన రూ.12లక్షల కోట్ల సంపద
Stock Market | త్రినేత్ర.న్యూస్ : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మార్కెట్‌లో సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ 2.50శాతానికిపైగా పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా వాణిజ్య ఒప్పందానికి ఇద్దరు నేతలు అంగీకరించారు. దాంతో వాషింగ్టన్ భారత వస్తువులపై సుంకాలను ప్రస్తుత 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ఉత్సాహం నెలకొంది. సెన్సెక్స్ ఉదయం 85,323.20 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో మొదలైంది.
ఆ తర్వాత ఇంట్రాడేలో 85,871.73 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 2.54 శాతం పెరిగి 83,739.13 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 639.15 పాయింట్లు పెరిగి 25,727.55 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,252.8 పాయింట్లు లేదా 4.99 శాతం పెరిగి 26,341.20కి చేరింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల విలువ రూ.12 లక్షల కోట్లు పెరిగి.. రూ.467.35 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అత్యధికంగా లాభపడ్డాయి. దాదాపు 11శాతం వరకు పెరిగాయి. అయితే ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఐటీసీ 1 శాతం వరకు పడిపోయాయి. ప్రధాన రంగాల సూచీలన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 3.5శాతం వరకు పెరిగాయి.
- మార్కెట్లు లాభాల్లో కొనసాగడానికి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందమే కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం ట్రంప్ మాట్లాడుతూ భారత్‌తో ఓ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని, దాంతో ప్రకారం అమెరికాకు భారతీయ ఎగుమతులపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లకు ఓ గేమ్ చేంజర్.
- అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం, యూరోపియన్ యూనియన్-భారత్ వాణిజ్య ఒప్పందాలు మార్కెట్ సెంటిమెంట్‌ను, ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని పెంచుతుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు.
- ఇకపై అమెరికా భారతదేశ ఉత్పత్తులపై 18శాతం సుంకాలు విధించనున్నది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై ట్రంప్ సర్కారు 20శాతం సుంకాలు విధిస్తుంది. పాకిస్తాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్‌పై 19శాతం సుంకాలు, 19 శాతం సుంకాలు విధిస్తోంది.
- ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ మధ్య వాణిజ్య చర్చలు.. యూఎస్ అధ్యక్షుడి వాణిజ్య ఒప్పందం ప్రకటన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఈ క్రమంలో రూపాయి విలువ ఒక శాతం కంటే ఎక్కువగా పెరిగి రూ.90.30కి చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాట్ మార్కెట్‌లో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో గత ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి దాదాపు 48 పైసలు పెరిగి రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
- ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి తిరిగి పుంజుకుంది. 5శాతం పెరిగింది. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈకాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ లాభాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
- బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు 0.51 శాతం తగ్గి బ్యారెల్‌కు 65.96 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధరల పతనం కారణంగా ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






