Stock Markets | ఖమేనీ మృతితో.. స్టాక్ మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం లేనట్లే..?
Stock Markets | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులను ప్రారంభించాయన్న వార్తలతో పెట్టుబడిదారులు, పారిశ్రామిక వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. గత వారం రోజుల నుంచి మార్కెట్లు పతనం అవుతూనే ఉండగా తాజా యుద్ధంతో మార్కెట్ మరింత పతనం అవుతుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు.
Stock Markets | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులను ప్రారంభించాయన్న వార్తలతో పెట్టుబడిదారులు, పారిశ్రామిక వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. గత వారం రోజుల నుంచి మార్కెట్లు పతనం అవుతూనే ఉండగా తాజా యుద్ధంతో మార్కెట్ మరింత పతనం అవుతుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడు మార్కెట్లలో భారీ స్థాయి పతనాన్ని చూసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో యుద్ధం ఆగిపోయినట్లేనని, మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం అంతగా ఉండదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారీ స్థాయిలో పతనం లేనట్లే..?
ఖమేనీ మృతి చెందడం మార్కెట్లకు పాజిటివ్ వార్తే అని విశ్లేషకులు చెబుతున్నారు. అంతకు ముందు భారీ స్థాయిలో క్రాష్ తప్పదని భావించినప్పటికీ ఖమేనీ మృతి వార్తతో మార్కెట్లపై కాస్త పాజిటివ్ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్లు అంతటి గణనీయమైన స్థాయిలో పతనం అయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగకపోయినా ప్రస్తుతం వస్తున్నవి పాజిటివ్ వార్తలే కనుక మార్కెట్లు వచ్చే వారంలో పుంజుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. ఇరాన్‌లో సమస్యలు ఇక వేగంగా పరిష్కారం అవుతాయని దీంతో మార్కెట్లు మళ్లీ పాజిటివ్‌లోకి వస్తాయని విశ్లేషిస్తున్నారు. అందువల్ల పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయంగా చెబుతున్నారు.
🚨 BIG BREAKING NEWS for Indian Stock Market! 🚨🇮🇳🔥 Tomorrow ✅🚀
Iran’s Supreme Leader Ayatollah Ali Khamenei is DEAD – officially confirmed by Iranian state media today (March 1, 2026)!
Killed in US-Israel strikes 🔥💥
This is HUGE positive twist for markets! Where a…
— Ankit Yadav (@ankit_investing) March 1, 2026
2-3 శాతం మేర మాత్రమే..?
అయితే యుద్ధం పూర్తిగా ముగిసిందన్న వార్తలు రావడం లేదు కానీ ఇప్పటికైతే మార్కెట్లు బుల్ రన్ కొనసాగించకపోయినా నష్టం మాత్రం భారీ ఎత్తున ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు 10 శాతం పతనాన్ని అంచనా వేయగా, ఇప్పుడది 2-3 శాతం మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ మార్కెట్లు వేగంగా పుంజుకుని బుల్ రన్ ను కొనసాగించడం ఖాయమని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ముడి చమురు ధరలు పెరుగుతాయని, ఇది తాత్కాలికమేనని, కొన్ని రోజులకు అంతా సర్దుకుంటుందని తెలిపారు. మార్కెట్లు దీర్ఘకాలంలో బుల్ రన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని, దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగడం ఖాయమని చెప్పారు. ఉద్రిక్తతలు కాస్త తగ్గే అవకాశం ఉంది కనుక ద్రవ్యోల్బణం కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదని తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా మళ్లీ భారత మార్కెట్లలోకి వస్తారని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



