త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stocks | స్టాక్ మార్కెట్లు నెగెటివ్‌లో ఉన్నా.. ఈ షేర్‌లో మాత్రం భారీగా రిట‌ర్న్స్‌..

Stocks | భారత స్టాక్ మార్కెట్‌ల‌లో బలహీన ధోరణి కొనసాగుతున్నప్పటికీ, ఆయుష్ (AAYUSH) షేర్ ధర శుక్రవారం దాదాపు 2 శాతం వరకు పెరిగింది. బీఎస్‌ఈలో ఈ స్మాల్‌క్యాప్ షేర్ 1.92 శాతం ఎగ‌బాకి ఒక్కో షేర్ ధర రూ.37.21 వరకు చేరింది. దలాల్ స్ట్రీట్‌లో నెగెటివ్ ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో ఈ పెరుగుదల చోటుచేసుకోవడం గమనార్హం.

S

Business | Published On May 8, 2026, 3.32 pm IST

Stocks | స్టాక్ మార్కెట్లు నెగెటివ్‌లో ఉన్నా.. ఈ షేర్‌లో మాత్రం భారీగా రిట‌ర్న్స్‌..
Advertisement

Stocks | భారత స్టాక్ మార్కెట్‌ల‌లో బలహీన ధోరణి కొనసాగుతున్నప్పటికీ, ఆయుష్ (AAYUSH) షేర్ ధర శుక్రవారం దాదాపు 2 శాతం వరకు పెరిగింది. బీఎస్‌ఈలో ఈ స్మాల్‌క్యాప్ షేర్ 1.92 శాతం ఎగ‌బాకి ఒక్కో షేర్ ధర రూ.37.21 వరకు చేరింది. దలాల్ స్ట్రీట్‌లో నెగెటివ్ ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో ఈ పెరుగుదల చోటుచేసుకోవడం గమనార్హం. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ 0.5 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్, ప్రివెంటివ్ వెల్‌నెస్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయుష్ వెల్‌నెస్ ఆయుష్ డ‌యా షీల్డ్ టాబ్లెట్స్ ను త‌యారు చేస్తూ డయాబెటిస్, మెటబాలిక్ హెల్త్ విభాగంలోకి వ్యూహాత్మక ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించింది.

దీర్ఘకాలంలో బ‌ల‌మైన రాబ‌డులు..

శుక్ర‌వారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఈ ఉత్పత్తి లాంచ్‌తో కంపెనీ రూ.366.56 బిలియన్ల‌ విలువైన అధిక వృద్ధి అవకాశాలున్న మెటబాలిక్ హెల్త్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. AAYUSH షేర్ ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు (వైటీడీ) 43 శాతం పడిపోయింది. ఏడాది కాలంలో ఈ స్టాక్ 63 శాతం క్షీణించింది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే స్టాక్ బలమైన రాబడులు అందించింది. రెండు సంవత్సరాల్లో 99 శాతం పెరుగుదల న‌మోదు చేయ‌గా, మూడు సంవత్సరాల్లో భారీగా 1,825 శాతం ర్యాలీని కొన‌సాగించింది. ఐదు సంవత్సరాల్లో 1,800 శాతం మల్టీబ్యాగర్ రిటర్న్స్ వ‌చ్చాయి.

ఇక ఆయుష్ వెల్‌నెస్ షేర్ ధర బీఎస్‌ఈలో 0.74 శాతం తగ్గి రూ.36.24 వద్ద ట్రేడవుతోంది. అయితే మ‌ల్టీ బ్యాగ‌ర్ స్టాక్స్ అన్నీ క‌చ్చిత‌మైన రాబ‌డుల‌ను అందించ‌లేవ‌ని, పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డి పెట్టేముందు ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిద‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement