19 Dec 2025 Friday Gold and Silver Rates | లేట్ చేస్తున్న కొద్దీ బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్పతే తగ్గడం లేదు. శుక్రవారం, 19 డిసెంబర్ 2025 బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.13,485 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,361 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.10,114 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు బంగారం ధరల్లో పెద్దగా పెరుగుదల లేదు. ఈ బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉంటాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే వెండి ధర ఒక గ్రాముకు ఇవాళ 224.10 గా ఉంది. కిలో వెండి ధర రూ.2,24,100 గా ఉంది. కిలో వెండి ధర రూ.2 లక్షల దాటి ఇంకా ముందుకు దూసుకెళ్తోంది. వచ్చే సంవత్సరం కిలో వెండి ధర రూ.3 లక్షల మార్క్‌ను చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.